శ్రీరాంపూర్, జూన్ 23 : సింగరేణి గనులు వేలం వేస్తే కార్మికులతో కలిసి ఒక్క బొగ్గు పెల్లను కూడా తీయనివ్వబోమని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివార్రావు స్పష్టం చేశారు. ఆదివారం శ్రీరాంఫూర్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీబీజీకేఎస్ శ్రీరాంపూర్ ఇన్చార్జి పెట్టం లక్షణ్‌తో కలిసి మాట్లాడారు. బీజేపీ సర్కారు దేశ వ్యాప్తంగా 300 గనులను ప్రైవేట్‌పరం చేసిందని మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వం 5 బొగ్గు గనులను సింగరేణికే ఇవ్వాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించిందని గుర్తు చేశారు. టీబీజీకేఎస్, బీఆర్ఎస్ పోరాటం చేసి గనుల వేలాన్ని అడ్డుకున్నాయని, అవసరమైతే మరోసారి కొట్లాడుతామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా గనుల వేలాన్ని నిలిపి వేసి.. సింగరేణి సంస్థకే వాటిని అప్పగించాలని డిమాండ్ చేశారు.
గనుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నామని చెబుతూనే ఉప ముఖ్యమంతి భట్టి విక్రమార్క వేలం ప్రారంభోత్సవానికి ఎలా హాజరయ్యారని ప్రశ్నించారు. నిజంగా గనుల వేలాన్ని వ్యతిరేకిస్తే వెంటనే అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లాలోని శ్రావణపల్లి బొగ్గు గనిని వెంటనే వేలం నుంచి తొలగించి సింగరేణికి అప్పగించాలని డిమాండ్ చేశారు. గోదావరి నది పరివాహక ప్రాంత బొగ్గు ఖనిజ నిక్షేపాలు కనుగొనడానికి సింగరేణి సంస్థ రూ. 60 కోట్లు ఖర్చు చేసిందన్నారు. బీజేపీ ప్రభుత్వం గుజరాత్‌లోలాగే సింగరేణికి కూడా నామినేషన్ పద్ధతిలో గనులు కేటాయించాలని డిమాండ్ చేశారు.
అధికారం అప్పగిస్తే కార్మికుల ఉద్యోగాలు ఊడగొడతారా అని ప్రశ్నించారు. ఈ సమావేశంలో నడిపెల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ విజిత్‌రావు, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు అక్కూరి సుబ్బయ్య, కార్యదర్శి మేరుగు పవన్, కౌన్సిలర్ వంగ తిరుపతి, టీబీజీకేఎస్ మాజీ కార్యదర్శి పానగంటి సత్తయ్య, కోటిలింగం, తొంగల రమేశ్, మాజీ సర్పంచ్ జక్కుల రాజేశం, మాజీ ఎంపీటీసీలు గుమ్మడి శ్రీనివాస్, తిరుపతి, బాకం నగేశ్, నాయకులు గొర్ల సంతోష్, జక్కుల కుమార్, రాజునాయక్, రఫీక్‌ఖాన్, కాటం రాజు, కందుల ప్రశాంత్, రవిగౌడ్, పెర్క సత్తయ్య, తిరుమల్‌రావు, దగ్గుల మధు, ఉత్తేజ్‌రెడ్డి, పెద్దపల్లి రామయ్య, నరేందర్‌రెడ్డి, వికాస్, భానుచందర్ పాల్గొన్నారు.
బీఆర్ఎస్ సర్కారులో పదేళ్లపాటు పదవులు అనుభవించి, వృద్ధాప్యంలో కాంగ్రెస్ పార్టీలో కి వెళ్తావా అంటూ మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు పోచారం శ్రీనివాస్‌పై మండిపడ్డారు. ఆ దివారం నస్పూర్ ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డికి ఎంతో గౌరవం ఇచ్చారని, కన్నతల్లిలాంటి పా ర్టీకి ద్రోహం చేస్తావా అంటూ ఆగ్ర హం వ్యక్తం చేశారు. ఈ వైఖరిని ప్రజాస్వామ్యవాదులు తీ వ్రంగా వ్యతిరేకించాలని కోరారు. పోచారం శ్రీ నివాస్‌ను కలవడానికి వెళ్లిన మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను పోలీసులు అక్రమంగా అరె స్ట్ చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. వెంటనే కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.
కోల్‌బెల్ట్ నస్పూర్, శ్రీరాంపూర్ ఏరియాకు చెందిన తొంగల రమేశ్ ఆదివారం తన అనుచరులతో కలిసి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు రమేశ్‌కు పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తొంగల రమేశ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ ఏరి యా ఇన్చార్జి పెట్టం లక్షణ్, నాయకులు రఫీక్‌ఖాన్, పానగంటి సత్తయ్య, ఉత్తేజ్‌రెడ్డి, రాజునాయక్, పార్టీ పట్టణ అధ్యక్షుడు అక్కూరి సుబ్బయ్య, కార్యదర్శి మెరుగు పవన్, నాయకులు తిరుమల్‌రావు, వెంకట్‌రెడ్డి, జక్కుల రాజేశం, వంగ తిరుపతి పాల్గొన్నారు.