మంచిర్యాల అర్బన్, మే 20 : లింగ నిర్ధా రణ పరీక్షలు చట్టరీత్యా నేరమని మంచిర్యాల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి అనిత పేర్కొన్నారు. జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో బుధవారం జిల్లాస్థాయి సలహా కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లాలో పని చేస్తున్న సానింగ్ కేంద్రాలు, స్త్రీ వైద్య నిపుణులు, సూపర్ స్పెషాలిటీ దవాఖానల్లో ఉన్న సానింగ్ మిషిన్ల ద్వారా అందిస్తున్న వైద్య సేవలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్వో మాట్లాడుతూ.. బేటీ బచావో-బేటీ పడావో కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని, అందులో భాగంగా గర్భిణుల పర్యవేక్షణ, అల్ట్రా సౌండ్ సానింగ్ మిషిన్ల పర్యవేక్షణ, తనిఖీలు, రికార్డులు, సీసెక్షన్ ఆడిట్, తల్లులకు మహిళా సంఘాల్లో అవగాహన కార్యక్రమాలు చేప్టాలన్నారు.
ప్రతీ సానింగ్ నియమ నిబంధనలు పాటించాలన్నారు. నూతన సానింగ్ మిషిన్ కొనేందుకు ముందుగానే నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తీసుకోవాలని, పాత మిషిన్ తీసివేయాలన్నా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ నుంచి అనుమతి తీసుకోవాలని పేర్కొన్నారు. మూసివేసిన సానింగ్ సెంటర్లో ఉన్న పరికరాలు, యంత్రాలను విక్రయిస్తే కొనుగోలు చేసిన వారి సమాచారం అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ అరుణశ్రీ, డాక్టర్ శ్రీదేవి, డాక్టర్ సుధాకర్, డాక్టర్ అభినవ్, జిల్లా మాస్ మీడియా అధికారి బుకా వెంకటేశ్వర్, డీపీవో ప్రశాంతి, సీహెచ్వో వెంకటేశ్వర్లు, సీనియర్ అసిస్టెంట్ హారిక, వైద్యులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
సత్వర వైద్య సేవలకు ట్రూ నాట్ మిషిన్లు
మందమర్రి, మే 20 : జిల్లాలో క్షయ బాదితులకు సత్వర వైద్య సేవలందించడంతో పాటు, వ్యాధి నియంత్రణలో బాగంగా ట్రూ నాట్ యంత్ర వైద్య సేవలు ప్రారంభిస్తున్నట్లు డీఎంహెచ్వో అనిత తెలిపారు. మందమర్రి పట్టణంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన ట్రూ నాట్ మిషిన్ సేవలను ప్రారంభించారు. జిల్లాలోని ఐదు ఆరోగ్య కేంద్రాల్లో ఈ సేవలు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పించి, క్షయ నిర్మూలనకు కృషిచేయాలని సూచించారు.
అనంతరం క్షయ నయంత్రణ పోస్టర్లు, కరపత్రాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో డిఫ్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ సుధాకర్ నాయక్, ఎంపీడీవోరాజేశ్వర్, మున్సిపల్ కమిషనర్ తుంగపిండి రాజలింగు, వైద్యాధికారులు ఇవాంజల్, లక్ష్మీప్రసన్న, మాస్ మీడియా అధికారి బుక్కా వెంకటేశ్వర్, సీహెచ్వోలు కాకిరాల వెంకటేశ్వర్లు, నాందేశ్ శ్రీనివాస్, డీపీఎంహెచ్వో పద్మ, క్షయ నియంత్రణ సమన్వయ కర్త సురేందర్, ఆశ కార్యకర్తలు, సిబ్బంది పాల్గొన్నారు.