సీసీసీ నస్పూర్/శ్రీరాంపూర్, జూలై 19 : సింగరేణి ఉద్యోగుల సంక్షేమానికి, అభ్యున్నతికి యాజమాన్యం కృషి చేస్తున్నదని డైరెక్టర్(ప్రాజెక్ట్అండ్ప్లానింగ్) వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. శనివారం శ్రీరాంపూర్ జనరల్ మేనేజర్ కార్యాలయంలో జీఎం శ్రీనివాస్‌తో కలి సి శిశు సంరక్షణ కేంద్రం, నస్పూర్‌కాలనీలో సుమారు రూ.20 లక్షలతో నిర్మించిన గోదావరి ఫంక్షన్ హాల్‌ను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సింగరేణి ఉద్యోగుల సౌకర్యార్థం అన్ని మౌలిక సదుపాయాలతో ఫంక్షన్ హాల్‌ను ఏర్పాటు చేసినట్లు చె ప్పారు. శ్రీరాంపూర్ ఏరియాలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగుల పిల్లల కోసం శిశు సంరక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు తెలిపారు.
ఉత్పత్తి లక్ష్య సాధనపై సమీక్ష
శ్రీరాంపూర్ జీఎం కార్యాలయంలో ఉత్పత్తి లక్ష్య సాధనపై డైరెక్టర్(పీపీ) వెంకటేశ్వర్లు అధికారులతో సమీక్ష నిర్వహించారు. బొగ్గు ఉత్పత్తి లక్ష్య సాధనకు సమష్టిగా కృషి చేయాలని కోరారు. ఓసీపీల్లో నిర్దేశిత ఉత్పత్తి లక్ష్యాలు సాధించేందుకు ప్రణాళికా బద్ధంగా ముందుకెళ్లాలని సూచించారు.
ఐకే ఓసీపై నూతన గదులు ప్రారంభం
జైపూర్, జూలై 19 : శ్రీరాంపూర్ డివిజన్లోని ఇందారం ఓపెన్‌కాస్టు గనిపై కార్మికుల సౌకర్యార్థం నిర్మించిన నూతన గదులను సింగరేణి డైరెక్టర్ (పీపీ) వెంకటేశ్వర్లు శనివారం ప్రారంభించారు. ఆయాచోట్ల ఎస్వో టూ డైరెక్టర్ మోహతా, శ్రీరాంపూర్ ఎస్వోటూజీఎం సత్యనారాయణ, గుర్తింపు సం ఘం ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి బాజీసైదా, వివిధ విభాగాల డీజీఎంలు రవీందర్, ఆనంద్‌కుమార్, శిరీషరెడ్డి, ఎస్టేట్స్ అధికారి వరలక్ష్మి, నాయకులు సమ్మయ్య, కొమురయ్య, కిషన్‌రావు, సందీప్, ఓసీపీల పీవోలు, ఏజెంట్లు, జీఎంలు పాల్గొన్నారు.
ఓసీపీ పనుల ప్రగతిపై సమీక్ష
రెబ్బెన, జూలై 19 : బెల్లంపల్లి ఏరియాలో శనివారం సింగరేణి డైరక్టర్ (ప్లానింగ్ అండ్ ప్రాజెక్టు) వెంకటేశ్వర్లు పర్యటించారు. గోలేటి జీఎం కార్యాలయంలో అధికారులతో సమావేశమై గోలేటి ఓసీపీ పనుల ప్రగతి పై సమీక్ష నిర్వహించారు. ఖైర్గూడ ఓసీపీ వ్యూ పాయింట్ నుంచి పని స్థలాలను పరిశీలించారు. బొగ్గు నిల్వలు, వర్షాలు కురిస్తే తీసుకునే చర్యలపై సూచనలు చేశారు. వట్టివాగుపై నిర్మిస్తున్న రక్షణ కట్ట పనులను పరిశీలించారు. నా ణ్యతతో పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
గోలేటి సింగరేణి డిస్పెన్సరీ తనిఖీ చేసి మందుల నిల్వలు, ఫర్నిచర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. పలుచోట్ల మొక్కలు నాటి నీరుపోశారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి ఏరియా జీఎం విజయభాస్కర్‌రెడ్డి, ఖైర్గూడ పీవో మచ్చగిరి నరేందర్, ఎస్వోటూజీఎం రాజమల్లు, సెక్యురిటీ అధికారి ఉమాకాంత్, డీజీఎం(సివిల్) మదీనబాషా, పీఈ వీరన్న, మేనేజర్ శంకర్, డాక్టర్ మురళీ, జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్ సుష్మ ఉన్నారు.