తలమడుగు, ఏప్రిల్ 7 : వయసు తగిన ఎత్తు, బరువు లేని పిల్లలను గుర్తించి పోహకాహార లోపాన్ని నివారించాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. పర్యవేక్షణతో కూడిన అనుబంధ ఆహారం, రకతహీనత అవగాహన సదస్సును మండల కేంద్రంలోని రైతు వేదికలో గురువారం నిర్వహించారు. జిల్లా అడిషనల్ కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్‌తో జిల్లా అధికారులతో కలిసి కలెక్టర్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ముం దుగా గ్రామంలో పురాతన వేంకటేశ్వర స్వామి ఆలయంలో కలెక్టర్ పూజలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. పౌష్టికాహార లోపం గల పిల్లలు, గర్భిణులను గుర్తించి అవసరమైన ప్రోటీన్లు అందించాలని సూచించారు. వయసుకు తగిన బరువు, ఎత్తులేని వారిని తగ్గ ఎత్తు లేని వారిని మిషన్ మోడ్‌లో ప్రత్యేక కార్యక్రమం కింద న్యూట్రిషన్ భోజనాన్ని అందించాలని సూచించారు. జన్యుపరమైన లోపాలను గుర్తించి అంగన్వాడీ, పాఠశాలల ద్వారా పౌష్టికాహారాన్ని అం దించాలన్నారు. కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తం గా సర్పంచ్‌లు, కార్యదర్శులు అధికారులు, ప్రజాప్రతినిధుల సహకారంతో మిషన్ మోడ్‌లో చేపట్టాలన్నారు. వచ్చే నెల వరకు గ్రామాల్లో ఇలాంటి చిన్నారులు ఉండకూడదని సూచించారు. సర్పంచ్ల సహకారంతో అంగన్వాడీ కేంద్రాల్లో కిచెన్ గార్డులు ఏర్పాటు చేసి ఆకుకూరలు, కూరగాయలను పెంచాలన్నారు. ప్రతి నెలలో గ్రామ ఆరోగ్య, పారిశుధ్య దినోత్సవం నిర్వహించాలని, సమావేశంలో పిల్లల ఆరోగ్య స్థితి గతులు, మహిళల ఆరోగ్యం, ప్రసవాలు, పారిశుధ్య అంశాలపై చర్చించి పనులను చేపట్టాలన్నారు. బుధవారం సామ్, మామ్ దినోత్సవం నిర్వహించి, తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలన్నారు. చిన్నారులకు వేడి నీటిని తాగించాలన్నారు. 18 వారాల్లోపు పిల్లల్లో మార్పులను గమనించాలని సూ చించారు. పలు అంశాలపై ప్రజాప్రతినిధులతో పాటు అధికారులు, వైద్య, అంగన్వాడీ సిబ్బందికి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సర్పంచ్ కరుణాకర్ రెడ్డి, డీపీవో శ్రీనివాస్, జిల్లా సంక్షేమ అధికారి మిల్కా, డిప్యూటీ డీఎంహెచ్‌వో సాధన, ఎంపీపీ కల్యాణం లక్ష్మి, జడ్పీటీసీ గోక గణేశ్ రెడ్డి, తహసీల్దార్ ఇమ్రాన్‌ఖాన్, ఎంపీడీవో రమాకాంత్, మండల ప్రత్యేకాధికారి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీవో దిలీప్, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.