చెన్నూర్ టౌన్, నవంబర్ 28 : జిల్లాకేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించతలపెట్టిన దీక్షా దివస్‌ను విజయవంతం చేయాలని పా ర్టీ నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ రాజారమేశ్ శ్రేణు లు, ప్రజలకు పిలుపునిచ్చారు. గురువారం చెన్నూర్‌లోని ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ ప్రాణాలకు తె గించి చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను గుర్తు చేసుకుంటూ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పి లుపు మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చె ప్పారు. ‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో’ అనే నినాదంతో 2009, నవంబర్ 29న ఆమరణ దీక్షకు పూనుకున్నారని, ఈ నేపథ్యంలో కేసీఆర్ అరెస్టుతో తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయని తెలిపారు.
బక్కపలుచని వ్యక్తితో ఏమవుతుందని ఆ రో జు జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ నాయకులు మాట్లాడారని, వారు కేసీఆర్ బలమే చూశారు కానీ.. బలగం గురించి, సంకల్పం గురించి మరిచిపోయి వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు. నాడు సబ్బండ వ ర్గాలు ఒక్కటై కేసీఆర్‌కు అండగా నిలిచాయని, ఉద్య మం ఉవ్వెత్తున ఎగిసిందని పేర్కొన్నారు. ‘నా దీక్ష వ ల్ల తెలంగాణ వస్తే జైత్రయాత్ర.. లేకుంటే నా శవయా త్ర ఉంటుంది’ అని కేసీఆర్ చెప్పడంతో కేంద్రం దిగిరాక తప్పలేదని చెప్పారు. పదేండ్ల పాటు కేసీఆర్ ప్ర భుత్వం రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధిని జోడెద్దులా ముందుకు తీసుకెళ్లాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ అబద్ధపు హామీలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిందని విమర్శించారు.
రేవంత్ పాలన గాడితప్పందని, విద్యార్థులు మృతి చెందుతున్నారని, అనేక సంఘాలు రోడ్డెక్కుతున్నాయని తెలిపారు. దొంగహామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగడుగునా నిర్బంధించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మరోసారి నాటి ఉద్యమ స్ఫూర్తిని, అనేక త్యాగాల పునాదుల మీద ఏర్పడిన ఉద్యమ ప్రస్థానం గురించి ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకోవాలని కోరారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆధ్వర్యంలో చేపట్టబోయే ఈ కార్యక్రమానికి దీక్షా దివస్ జిల్లా ఇన్చార్జి తుల ఉమ, మంచిర్యాల, బెల్లంపల్లి నియోజకవర్గాల మాజీ ఎమ్మెల్యేలు నడిపెల్లి దివాకర్ రావు, దుర్గం చిన్నయ్య ముఖ్య అతిథులుగా హాజరవుతారని, బీఆర్ఎస్ శ్రేణులు, జిల్లా ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో చెన్నూర్ ము న్సిపల్ వైస్ చైర్మన్ నవాజుద్దీన్, కౌన్సిలర్లు జోడు శం కర్, తుమ్మ రమేశ్, రేవెల్లి మహేశ్, జగన్నాథుల శ్రీ ను, వేల్పుల సుధాకర్, మాజీ ఎంపీపీ మంత్రి బాపు, మాజీ సర్పంచ్ సాధనబోయిన కృష్ణ, బీఆర్ఎస్ నాయకులు నాయని సతీశ్, అరీఫొద్దీన్, మేడ సురేశ్, మహేందర్, పాశం ఆశిష్, నాయబ్, జడల మల్లేశ్, తగరం శంకర్, ప్రశాంత్ రెడ్డి, వెంకన్న పాల్గొన్నారు.