తాండూర్ : మంచిర్యాల జిల్లా తాండూరు మండల కేంద్రంలోని మాదారం పోలీస్ స్టేషన్ గ్రౌండ్లో ఓపెన్ జిమ్ వద్ద తాండూర్ తెలంగాణ లయన్స్ క్లబ్ ( Lions Club) సభ్యులు గురువారం ఉచితంగా మధుమేహం (Diabetes ) వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా 48 మందికి మధుమేహం వ్యాధి, బీపీ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. మదుమేహం, బీపీ ఉన్న వారికి పలు జాగ్రత్తలు సూచించారు. ఆరోగ్య రక్షణకు ప్రతి ఒక్కరూ, ప్రతిరోజు వ్యాయామం చేయాలని తెలిపారు .
వ్యాయామం, నడక, యోగా, స్విమ్మింగ్, సైక్లింగ్ చేస్తే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు దేవరకొండ రాజన్న, ఉపాధ్యక్షులు మద్దికుంట రాంచందర్, ఠాకూర్ ఉమ్రావ్ సింగ్, కాబినెట్ మెంబర్ రౌతు వెంకటేశం, తాటిపాముల సాంబమూర్తి, గందె రాజన్న, తొగరు శ్రీనివాస్, ల్యాబ్ టెక్నీషన్ వేణు, వాకర్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.