ఎదులాపురం, సెప్టెంబర్ 18 ః రీజినల్ సైనిక్ వెల్ఫేర్ కార్యాలయాన్ని బుధవారం కలెక్టర్ రాజర్షి షా ప్రారంభించారు. బుధవారం ఆదిలాబాద్ పట్టణంలోని సంజయ్‌నగర్‌లో రూ.8 లక్షల విలువ గల భవనాన్ని ప్రారంభించి మొక్కలు నాటారు. అనంతరం కలెక్టర్ ఛాంబర్లో రీజనల్ సైనిక్ వెల్ఫేర్ బోర్డు మీటింగ్ నిర్వహించారు. ఈ మీటింగ్‌లో సైనిక్ వెల్ఫేర్ కార్యక్రమాలైన ఐడీ కార్డు జారీ చేసే విధానం, హౌస్ ప్లాట్స్, అగ్రికల్చర్ ల్యాండ్, క్యాంటీన్ ఏర్పాటు కోసం వైద్య సదుపాయాలు కల్పించడం కోసం స్వయం ఉపాధి రుణాల కోసం లీడ్ బ్యాంకు మేనేజర్ ద్వారా పరిశ్రమల శాఖ ద్వారా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ పథకాలు మ్యారేజ్, చదువు కోసం సంబంధించిన విషయాలను చర్చించారు. ఆర్మీ వితంతువైన సిరికొండకు చెందిన మహిళా ఎక్స్ సర్వీస్మన్ వెల్కర్ పూజకు రూ.2 లక్షల చెక్కును కలెక్టర్ చేతల మీదుగా అందించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో వినోద్ కుమార్, జిల్లా యువజన క్రీడా, సైనిక్ సంక్షేమాధికారి వెంకటేశ్వర్లు, జిల్లా పౌర సంబంధాల అధికారి బి.తిరుమల, జిల్లా ఉపాధి కల్పన అధికారి మిల్కా, మాజీ సైనిక సంఘం అధ్యక్షులు శంకర్ దాస్, ఉపాధ్యక్షులు అశోక్, సెక్రెటరీ మోహన్, క్యాషియర్ దేవన్న, మంచిర్యాల జిల్లా కమిటీ సభ్యులు భాస్కర్ రెడ్డి, రవి, డీబీ చారి, సత్తయ్య, మధు పాల్గొన్నారు.