బెల్లంపల్లి/కన్నెపల్లి/బెజ్జూర్, మార్చి 25 : సమస్కలను పరిష్కరించాలని కోరుతూ శాంతియుతంగా నిరసన తెలిపేందుకు హైదరాబాద్ వెళ్లిన ఆశ కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జి చేసి అరెస్ట్ చేయడం హేయమైన చర్య అని తెలంగాణ ఆశ కార్యకర్తల యూనియన్(సీఐటీయూ) నాయకులు అన్నారు. మంగళవారం బెల్లంపల్లిలో అంబేద్కర్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆశ కార్యకర్తలు నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి నెలా రూ. 18వేలు చెల్లించాలని, సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేదంటే పెద్ద ఎత్తున ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ మండల కన్వీనర్ చల్లూరి దేవదాస్, నాయకులురాళ్లు రాణి, ఎం.భాగ్యలక్ష్మి, కే.నసీమా, ధనలక్ష్మి, లత, సుజాత, అరుణ, మాణిక్యం, పరమేశ్వరి, స్రవంతి, స్వరూప, భారతి, గంగారాణి, రజియా, స్వరూపా రాణి, సరిత, శ్యామల పాల్గొన్నారు.
అంబేద్కర్ విగ్రహానికి వినతి
తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ కన్నెపల్లి మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందించి ఆశ కార్యకర్తలు నిరసన తెలిపారు. అసెం బ్లీ సమావేశాల సందర్భంగా మంత్రులను కలిసి సమస్యల ను విన్నవించేందుకు వెళ్లిన తమను అక్రమంగా అరెస్టు చేసి దురుసుగా ప్రవర్తించడం హేయమైన చర్య అన్నారు.
బెజ్జూర్ మండల కేంద్రంలో గాంధీ విగ్రహం ముందు ఆశ కార్యకర్తలు నిరసన తెలిపారు. ఆశ కార్యకర్తల యూనియన్ మండల అధ్యక్షురాలైన సరోజన మాట్లాడుతూ హెల్త్ కమిషనర్ కార్యాలయం ఎదుట నిరసన శాంతియుతంగా నిరసన తెలిపిన ఆశ కార్యకర్తలపై పోలీసులు లాఠిచార్జి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.