అరనిమిషం ఆలస్యమైనా అనుమతి ఉండదు
టీఎస్పీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఉదయం 10-15 గంటల తరువాత అరనిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రాల్లోకి అనుమతి ఉండదని మంచిర్యాల కలెక్టర్ భారతీ హోళికేరి స్పష్టం చేశారు
- గ్రూప్-1 పరీక్షకు 27 కేంద్రాలు ఏర్పాటు
- హాజరుకానున్న 9,243 మంది అభ్యర్థులు
- ఆయా ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలు
- సీసీ కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ
- రెండు గంటల ముందే చేరుకోవాలి
- విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించిన మంచిర్యాల కలెక్టర్ భారతీ హోళికేరి
హాజీపూర్, అక్టోబర్ 13 : టీఎస్పీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఉదయం 10-15 గంటల తరువాత అరనిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రాల్లోకి అనుమతి ఉండదని మంచిర్యాల కలెక్టర్ భారతీ హోళికేరి స్పష్టం చేశారు. కలెక్టరేట్లో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాలో 9,243 మంది అభ్యర్థుల కోసం 27 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లా కేంద్రంలో 20, నస్పూర్‌లో 1, బెల్లంపల్లిలో 6 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. అన్ని కేంద్రాలకు చీఫ్ సూపరింటెండెంట్లు, ఏఎల్వోలు, 8 రూట్లలో లైజనింగ్ అధికారులతో పాటు మూడు ఫ్లయింగ్ స్కాడ్ బృందాలను నియమించామన్నారు.
అభ్యర్థులు రెండు గంటల ముందు పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని తెలిపారు. ప్రతి కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, అవసరమైన చోట వీడియో చిత్రీకరణ చేస్తామని చెప్పారు. ఇప్పటి వరకు 6,072 మంది అభ్యర్థులు హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకున్నారని, మిగిలిన అభ్యర్థులు www.tspsc.gov.in వెబ్ సైట్ నుంచి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని తెలిపారు. ఈ నెల 16న(ఆదివారం) ఉదయం పదిన్నర నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉదయం 8: 30 గంటల నుంచి కేంద్రంలోకి అనుమతిస్తామని చెప్పారు.
ఉదయం 10-15 గంటల తరువాత అరనిమిషం ఆలస్యమైనా అనుమతి ఉండదని స్పష్టం చేశారు. దివ్యాంగ అభ్యర్థులు గ్రౌండ్ ఫ్లోర్‌లోనే పరీక్ష రాసేలా ఏర్పాట్లు చేశామన్నారు. అంధులైన అభ్యుర్థులకు అదనంగా 20 నిమిషాల సమయం కేటాయిస్తామని చెప్పారు. అంధ విద్యార్థులు 19 మంది సహాయకులు కావాలని కోరారని, వారికి అవసరమైన ఏర్పాట్లు చేశామని తెలిపారు. అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు సకాలంలో చేరేందుకు బస్సులను ఏర్పాటు చేయాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించామన్నారు. కేంద్రాల్లో విద్యుత్ సరఫరా, మూత్రశాలలు, తాగునీరు, పారిశుధ్య నిర్వహణ కోసం ప్రత్యేక సిబ్బంది, వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచినట్లు కలెక్టర్ స్పష్టం చేశారు.
అభ్యర్థులు పాటించాల్సిన నిబంధనలు ఇవి..
- పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు రైటింగ్ ప్యాడ్లు, మొబైల్ ఫోన్లు, క్యాలిక్యులేటర్, ఇతరాత్ర ఎలక్ట్రానిక్ పరికరాలు పరీక్షా కేంద్రాలకు తీసుకురావద్దు.
- అభ్యర్థులు తమ హాల్ టికెట్లతో పాటు ఒక గుర్తింపు కార్డు ఒరిజనల్ (ఆధార్/పాన్/ఓటరు/ఎంప్లాయిమెంట్/డ్రైవింగ్ లైసెన్స్/పాస్ పోర్ట్) తీసుకురావాలి.
- హాల్‌టికెట్‌పై ఫొటో/సంతకం సరిగా లేని వారు గెజిటెడ్ అధికారి ధ్రువీకరించిన 3 పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలను పరీక్షా కేంద్రంలో అప్పగించాలి. లేదంటే పరీక్షకు అనుమతించరు.
- అభ్యర్థుల బయోమెట్రిక్ తీసుకున్న అనంతరం పరీక్ష హాల్లోకి అనుమతిస్తారు. బయోమెట్రిక్ హాజరు నమోదు ఉన్నందున చేతులకు మెహందీ, టాటూలు ఉండకూడదు.
- అభ్యర్థులు బూట్లతో రావడానికి అనుమతి లేదు. చెప్పులు మాత్రమే ధరించాలి.
- పరీక్షలో బ్లూ/ బ్లాక్ బాల్ పాయింట్ పెన్నులు మాత్రమే ఉపయోగించాలి.
- ప్రశ్నాపత్రం సిరీస్ ఏ, బీ, సీ, డీ బదులుగా ఆరు అంకెల సంఖ్యకు మార్చబడింది. హాల్‌టికెట్ నంబర్, వోఎంఆర్ జవాబు పత్రంలో బుక్లెట్ సంఖ్య కోడ్‌ను సరిగ్గా రాయాలి.
- ఓఎంఆర్ జవాబు పత్రంపై వైట్నర్/చాక్పవర్/ బ్లేడ్/ ఎరేజర్ ఉపయోగించవద్దు.
- పరీక్ష పూర్తయ్యే వరకు అభ్యర్థులను పరీక్ష హాలు నుంచి బయటకు అనుమతించరు.
- పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయడంతో పాటు సమీప ప్రాంతాల్లో ఫొటో స్టాట్/ జిరాక్స్ సెంటర్లను మూసి ఉంచాలి.
అభ్యర్థులు సకాలంలో హాజరుకావాలి
ఆసిఫాబాద్, అక్టోబర్13 : గూప్-1 ప్రిలిమినరీ పరీక్షలకు హాజరు అయ్యే అభ్యర్థులు సకాలంలో హాజరు కావాలని కలెక్టర్ రాహుల్‌రాజ్, ఎస్పీ సురేశ్ కుమార్ సయుక్తంగా ఒక ప్రకటనలో గురువారం కోరారు. జిల్లాలో 10 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసి, ముఖ్య పర్యవేక్షకులు, లైజన్, సహాయ లైజన్ అధికారులు, ఫ్లయింగ్ స్కాడ్, ఇన్విజిలేటర్లు ,సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే అభ్యర్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకునేలా రవాణా సౌకర్యం చూసుకోవాలని తెలిపారు. ఉదయం 8.30 గంటల నుంచి బయోమెట్రిక్ అటెండెన్స్ మొదలవుతుందని తెలిపారు. ఉదయం 10.15 గంటల తర్వాత పరీక్షా కేంద్రం గేట్లు మూసి వేస్తామని పేర్కొన్నారు. అర నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని సృష్టం చేశారు. మరింత సమాచారం కోసం టీఎస్పీఎస్సీ టోల్ ఫ్రీ నం. 18004253424, జిల్లా హెల్ప్‌లైన్ నం.18005991200, 08733279333లలో సంప్రదించవచ్చని సూచించారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

