మందమర్రి, ఏప్రిల్ 18 : బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ శుక్రవారం ఉద యం నామినేషన్ దాఖలు చేస్తారు. ఈ సందర్భంగా పెద్దపల్లి పట్టణంలోని అంబేద్కర్ విగ్ర హం వద్ద నిర్వహించ తలపెట్టిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్ ను విజయవంతం చేయాలని చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ పిలుపు నిచ్చారు.
ఈ కార్యక్రమానికి ఎంపీపీ లు, జడ్పీటీసీలు, మున్సిపల్ చైర్మన్లు, వైస్ ఎంపీపీలు, ఏఎంసీ, పీఏసీఎస్ చైర్మన్లు, డైరెక్టర్లు, కౌన్సిలర్లు, మా జీ సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, బీఆర్ఎస్ మండల, పట్టణ నాయకులు, కార్యకర్తలు, బీఆర్ఎస్వీ నాయకులు, యూత్ నాయకులు, కో-ఆప్షన్ సభ్యు లు, వార్డు మెంబర్లు, మహిళలు, పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో తరలి వచ్చి విజయవంతం చేయాలని కోరారు.