మంచిర్యాలటౌన్/లక్షెట్టిపేట/చెన్నూర్ రూరల్, జనవరి 31: హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో శుక్రవారం ఏర్పాటు చేసి న ఆత్మీయ సన్మాన సభకు మంచిర్యాల జిల్లా కు చెందిన మాజీ మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు తరలివెళ్లారు.
06
మున్సిపాలిటీల పాలకవర్గాల పదవీ కాలం ముగిసిన సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు ఆధ్వర్యం లో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మంచిర్యాల మాజీ మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య, లక్షెట్టిపేట మాజీ చైర్మన్ నలుమాసు కాంతయ్య, మాజీ వైస్ చైర్మన్ పోడేటి శ్రీనివాస్‌గౌడ్,
నస్పూరు మున్సిపల్ మాజీ చైర్మన్ ఈసంపల్లి ప్రభాకర్, చెన్నూర్ మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్‌ను రాంలాల్ అర్చనా గిల్డా, మాజీ వైస్ చైర్మణ్ నవాజ్‌లను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ విప్ బాల్క సుమన్, మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, జగదీశ్వర్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు విజిత్ బాబు పాల్గొన్నారు.