బెల్లంపల్లి : తెలంగాణ జూనియర్ అథ్లెటిక్ 11వ ఛాంపియన్షిప్ పోటీల్లో భాగంగా మంచిర్యాల జిల్లా స్థాయి క్రీడా పోటీల్లో కృష్ణవేణి విద్యార్థులు ప్రతిభను కనబరిచారు. అథ్లెటిక్స్ అసోసియేషన్ సెక్రెటరీ మారయ్య ఆధ్వర్యంలో డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించిన అండర్-14, అండర్-16, అండ్-18, అండర్-20 విభాగంలో బెల్లంపల్లి కృష్ణవేణి పాఠశాల విద్యార్థులు రాణించారు.
ఇందులో ప్రతిభ కనబరచిన క్రీడాకారులను కృష్ణవేణి టాలెంట్ స్కూల్ జోనల్ అకాడమిక్ మేనేజర్ నాగినేని సంపత్ రావు, పాఠశాల డైరెక్టర్ ఈ. రవి ప్రసాద్, ప్రిన్సిపల్ యం. రాజా రమేష్ మెడల్స్‌తో సత్కరించి అభినందించారు. అండర్-14 బాలికల విభాగంలో ఎన్. సహస్య (6వ తరగతి) కిడ్స్ జావలిన్ లో బ్రాంజ్ మెడల్, త్రయత్లాన్ సి-గ్రూప్ లో కె. దీక్ష (8వ తరగతి) 60 మీటర్స్, లాంగ్ జంప్ మరియు 600 మీటర్స్ పరుగు పందెంలో బ్రాంజ్ మెడల్స్ ను సాధించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు వి. మల్లేష్ యాదవ్, సల్పాల, సంతోష్ యాదవ్ , ఉపాధ్యాయులు పాల్గొన్నారు.