కాగజ్‌నగర్, జూన్ 21 : సిర్పూర్ పేపర్ మిల్లులో ఎన్నికల నిర్వహణపై ఎమ్మెల్యే పాల్వా యి హరీశ్ బాబు, ఎమ్మెల్సీ దండే విఠల్ నోరు మెదపడం లేదని సిర్పూర్ మాజీ ఎమ్మె ల్యే కోనేరు కోనప్ప అన్నారు. కాగజ్‌నగర్ పట్టణంలోని తన నివాసంలో ఆదివారం ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పేపర్ మిల్లులో ఎన్నికలు నిర్వహించాలని గుర్తింపు కార్మిక సంఘం జేఏసీ నాయకులు రిలే దీక్షలు చేస్తుంటే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు ఎందుకు మద్దతూ పలకడం లేదని, దీక్షలో ఎందుకు పాల్గొనడం లేదని ప్రశ్నించా రు. మిల్లు యాజమాన్యంతో కుమ్మక్కైన ప్ర జా ప్రతినిధులు కొత్త డ్రామాకు తెరలేపుతున్నారని ఆరోపించారు. ఒక్కసారి అవకాశం ఇస్తే నాలుగు వేల ఉద్యోగాలు కల్పిస్తామన్నా స్థానిక ఎమ్మెల్యే మిల్లులో కనీసం ఎన్నికలు నిర్వహించలేకపోతున్నారన్నారు. కార్మికుల సమస్యలను ప్రభుత్వం, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ సైతం పట్టించుకోవం లేదన్నారు.
గతంలో కార్మికుల బోనస్, ఇతరాత్ర సమస్యల పరిష్కారం కోసం యాజమాన్యంతో మాట్లాడిన సందర్భాలు ఉన్నాయని గుర్తు చేశారు. అనేకసార్లు మిల్లు కార్మికులను ఆదుకున్నా సందర్భాలు ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. కానీ, ప్రస్తుతం హోదాలో ఉన్న ప్రజాప్రతినిధులు ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. కార్మికుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఉందని, ఈ నెల 24న హైదరాబాద్‌లోని లేబర్ కమిషనర్‌ను కలిసి ఎన్నికలు నిర్వహణకు కృషి చేస్తామన్నారు. మిల్లులో వెంటనే గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూరియా యాప్ ద్వారా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వెంటనే యూరియా యాప్‌ను రద్దు చేయాలన్నారు.
ఆన్లైన్లో యూరియా బుక్ చేసుకుంటే పక్క మండలాలకు వెళ్లి యూరియా తెచ్చుకోవాల్సిన పరిస్థితి దాపురించిందని, ఇలా రైతులపై అదనంగా రూ. 500 భారం పడుతుందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరిగా రైతులకు నేరుగా ఎరువులు అందించాలన్నారు. పట్టణంలోని ఈఎస్ఐ దవాఖాన మూతపడే దశకు చేరుకుందని, పట్టించుకునే నాథుడు లేడని, తన ప్రైవేట్ దవాఖాన ప్రయోజనం కోసం ఈఎస్ఐ దవాఖానను విస్మరిస్తున్నాడని విమర్శించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు నియాజోద్దిన్ బాబు, వలీ, వసీం, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కొంగ సత్యనారాయణ, నక్క మనోహర్; అంబాల ఓదెలు, రాజ్‌కుమార్ పాల్గొన్నారు.