ఆదిలాబాద్: యోగాతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్ (SP Kanthilal Patil) అన్నారు. ప్రపంచ యోగ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ఏఆర్ హెడ్ క్వాటర్స్‌లో ఏర్పాటు చేసిన యోగ కార్యక్రమానికి హాజరై పోలీస్ అధికారులు, సిబ్బందితో కలిసి యోగా ఆసనాలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యోగా యొక్క ప్రాముఖ్యతను తెలియజేశారు. ఒత్తిడిని తగ్గించడంలో యోగా ఉపయోగపడుతుందని, ప్రతి పోలీస్ అధికారి, సిబ్బంది యోగాను తమ దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్ ఏఎస్పీ చిత్త రంజన్, కాగజ్ నగర్ డిఎస్పీ రామానుజం, డిసీఆర్బి డీఎస్పీ విష్ణుమూర్తి, సిబ్బంది తదితరులు ఉన్నారు.