Crime news | అక్రమంగా తరలిస్తున్న కలప పట్టివేత
కుమ్రం భీం ఆసిఫాబాద్ : అక్రమంగా తరలిస్తున్న కలపను అటవీ శాఖ అధికారులు పట్టుకున్నారు. ఈ సంఘటన ఆసిఫాబాద్ రేంజ్ పరిధిలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. ఆసిఫాబాద్ రేంజ్ అధికారి అప్పలకొండ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. అక్రమంగా కలప తరలిస్తున్నారనే సమాచారం మేరకు అధికారులు తనిఖీలు చేపట్టారు.
పంగిడిమాధర వైపు నుంచి ఆసిఫాబాద్ వైపు ఓ వాహనంలో కలపను తరలిస్తుండగా అటవీ అధికారులు వాహనాన్ని వెంబడించారు. అయితే అధికారులకు కల్లు కప్పి వాహనం డొర్లీ గ్రామంలోకి వెళ్లింది.
కాగా, ఓ పెద్ద లోయలో వాహనాన్ని వదిలి డ్రైవర్ పారిపోయాడు. అధికారులు వాహనాన్ని స్వాధీనం చేసుకుని దుంగలు రేంజ్ కార్యాలయానికి తరలించారు.
వాహనంలో 18 దుంగలు స్వాధీనం చేసుకున్నట్లు అప్పలకొండ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అక్రమంగా కలపను తరలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.కార్యక్రమంలో డిప్యూటీ రేంజ్ అధికారి యోగేష్, ప్రవీణ్ కుమార్, ఝాన్సీ రాణి, తిర్యానీ రేంజ్ సెక్షన్ అధికారులు విజయ్ కుమార్, మహేందర్, బీట్ అధికారులు స్వప్న, శ్రీనివాస్ పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

