కుమ్రంభీం ఆసిఫాబాద్ : కుమ్రంభీం జిల్లాలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. చింతలమానేపల్లి మండలం దిందా గ్రామంలో పోడు రైతులకు, అటవీ శాఖ అధికారులకు మధ్య ఘర్షణ నెలకొంది. పోడు భూములు దున్నుతున్న రైతులను అటవీ శాఖ అధికారులు అడ్డుకున్నారు. అటవీ శాఖ అధికారులు
పోలీసుల సహాయంతో పోడు రైతులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలిస్తుండగా ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఎన్నో ఏండ్లుగా సాగు చేసుకుంటున్న భూమిని అధికారులు అడ్డుకోవడం సరైంది కాదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.