వాడవాడలా ఉత్సాహంగా..
కుమ్రం భీం ఆసిఫాబా ద్, మంచిర్యాల జిల్లాల్లో పల్లె పట్టణ ప్రగతి కార్యక్రమాలు ఎనిమిదో రోజైన శుక్రవారం ఉత్సాహంగా కొనసాగాయి. గ్రామాలు, పట్టణాల్లో అధికారులు, ప్రజా ప్రతినిధులు కలియదిరిగారు. ప్రగతి పనులను పర్యవేక్షించారు. కాగజ్‌నగర్‌టౌన్ పట్టణంలోని అంగన్వాడీ కేంద్రాలు
8వరోజుకు చేరిన పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు
పనులను పరిశీలించిన అధికారులు, ప్రజాప్రతినిధులు
క్షేత్రస్థాయిలో సిబ్బందికి సూచనలు
పారిశుధ్యం, పచ్చదనంపై ప్రజలకు అవగాహన
బెల్లంపల్లిలో పాల్గొన్న ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య
కుమ్రం భీం ఆసిఫాబాద్ /మంచిర్యాల, జూన్ 10(నమస్తే తెలంగాణ) : కుమ్రం భీం ఆసిఫాబా ద్, మంచిర్యాల జిల్లాల్లో పల్లె పట్టణ ప్రగతి కార్యక్రమాలు ఎనిమిదో రోజైన శుక్రవారం ఉత్సాహంగా కొనసాగాయి. గ్రామాలు, పట్టణాల్లో అధికారులు, ప్రజా ప్రతినిధులు కలియదిరిగారు. ప్రగతి పనులను పర్యవేక్షించారు. కాగజ్‌నగర్‌టౌన్ పట్టణంలోని అంగన్వాడీ కేంద్రాలు, క్రీడా ప్రాంగణాలను కలెక్టర్ రాహుల్‌రాజ్ సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పట్టణంలో మౌలిక వసతుల కల్పన కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభు త్వం పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని చేపడుతుందని, అధికారులు , ప్రజా ప్రతినిధుల సమన్వయంతో పనులను పూర్తి చేసేందుకు కృషిచేయాలని పేర్కొన్నారు. ఆయన వెంట మున్సిపల్ కమిషనర్ సీవీఎస్ రాజు ఉన్నారు. బెల్లంపల్లి పట్టణంలోని 5,6,7 వార్డుల్లో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పర్యటించారు.
ఇంటింటికీ కలియదిరిగారు. కొన్ని సమస్యలు అక్కడికక్కడే పరిష్కరించగా, దీర్ఘకాలిక సమస్యలను విడుతల వారీగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఆయన వెంట మున్సిపల్ చైర్ పర్సన్ జక్కుల శ్వేత, వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్ ఉన్నా రు. హాజీపూర్ మండల కేంద్రంలోని వేంపల్లిలో పారిశుధ్య పనులను డీపీ వో నారాయణ రావు పరిశీలించారు. పల్లెల్లో చెత్తా చెదారం కనిపించకుం డా పరిశుభ్రంగా ఉంచాలన్నారు. లక్షెట్టిపేటలోని పలు కాలనీల్లో మున్సిపల్ చైర్మన్ కాంతయ్య, వైస్ చైర్మన్ పొడేటి శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేశ్ పారిశుధ్య పనులను పరిశీలించారు. మంచిర్యాల ము న్సిపాలిటీ పరిధి ఎనిమిది, తొమ్మిది, 22 వార్డు ల్లో చైర్మన్ పెంట రాజయ్య వార్డు ప్రజలతో సమావేశం నిర్వహించారు. పరిసరాల పరిశుభ్రత, ఆరో గ్యం, తడి, పొడి చెత్తల సేకరణ, వార్డులో జరుగుతున్న అభివృద్ధి పనులకు సంబంధించిన అంశాలపై చర్చించారు. 22 వార్డుల్లో పారిశుధ్య పనుల ను పరిశీలించారు. రాళ్లవాగు సమీపంలోని పోచ మ్మ ఆలయం వద్ద చెత్తాచెదారాన్ని తొలగించారు.

మంచిర్యాలటౌన్ : మేదరివాడలో పారిశుధ్య పనులు పరిశీలిస్తున్న మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య, కమిషనర్, కౌన్సిలర్

హాజీపూర్ : పారిశుధ్య పనులను పరిశీలిస్తున్న డీపీవో
Read Today's Latest Adilabad Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

