Jainur | జైనూర్, మార్చి 23 : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండల కేంద్రంలో ప్రతి గురువారం నిర్వహించే తై బజార్, పశువుల సంతలను ఈ నెల 24న వేలంపాట వేస్తున్నట్లు జైనూర్ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ కొడప ప్రకాష్, గ్రామ పంచాయతీ ఇంచార్జి ఈవో ఆనందరావ్ ఒక ప్రకటనలో తెలిపారు.
వేలంపాటలో పాల్గొనే వారు తై బజార్‌కు ఒక్కొక్కరు రూ.50 వేలు, పశువుల సంత వేలం పాటలో పాల్గొనే వారు రూ.లక్ష చొప్పున డిపాజిట్ చెల్లించి, నిబంధనల ప్రకారం వేలం పాటలో పాల్గొనాలని నిర్వాహకులు సూచించారు.