చింతలమానేపల్లి, ఫిబ్రవరి04 : చింతలమానేపల్లి మండల కేంద్రంతో పాటు లంబడిహెట్టి, రణవెల్లి, దిందా, గూడెం గ్రామాల్లో మంగళవారం గుడుంబా స్థావరాలపై ఎక్సైజ్ శాఖ అధికారులు దాడులు నిర్వహించినట్లు ఎక్సైజ్ సిఐ రవి తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఈ దాడుల్లో 20 లీటర్ల నాటుసారాయి బాటిళ్లు స్వాధీనం చేసుకొని ముగ్గురు వ్యక్తులపై కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. గుడుంబా తయారీ, గంజాయి, మత్తు పదార్ధాల వలన కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు. అనంతరం తహసీల్దార్ మునావర్ షరీఫ్ ఎదుట 5 గురిని బైండోవర్ చేసినట్టు అయన తెలిపారు. ఈ దాడులలో ఆదిలాబాద్ ఎక్సైజ్, ఎన్ఫోర్స్మెంట్ సిఐ అక్బర్ హుస్సేన్, ఎస్ఐలు సురేష్, పి.రాజేశ్వర్, సిబ్బంది పాల్గొన్నారు.