కుమ్రం భీమ్ అసిఫాబాద్ : సీఎం కేసీఆర్ విద్యా రంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని జెడ్పీ చైర్ పర్సన్ కోవ లక్ష్మి , అసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు అన్నారు. పల్లె ప్రగతిలో భాగంగా అసిఫాబాద్, రాజంపేటలో మనఉరు -మనబడి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. స్వరాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు నాణ్యమైన విద్య అందుతుందన్నారు.
సర్కార్ బడులను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని వారు తెలిపారు. పాఠశాలల బలోపేతం కోసం ప్రభుత్వం ఎన్నారైలు, స్వచ్ఛంద సంస్థలు, దాతలను భాగస్వాములను చేస్తూ ముందుకెళ్తుందన్నారు.
మన ఊరు- మనబడితో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారుతున్నాయని పేర్కొన్నారు కార్యక్రమంలో అసిఫాబాద్ జెడ్పీటీసీ అరిగెల నాగేశ్వరరావు, టీఆర్ఎస్ నేతలు సాంగ్డే జీవన్, సైదాం సురేష్, తదితరులు పాల్గొన్నారు.