Jainur | ప్రొటోకాల్ ఉల్లంఘనపై గరమైన ఆదివాసీలు.. ఎమ్మెల్యేకు క్షమాపణ చెప్పాలని డిమాండ్..!
జైనూర్, జూన్ 02: కాగజ్‌నగర్‌లో జరిగిన ప్రభుత్వ సభలో స్థానిక ఆదివాసీ ఎమ్మెల్యే కోవ లక్ష్మి(Kova Laxmi)ని ప్రోటోకాల్ ప్రకారం గౌరవించకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వం అహంకారానికి పరాకాష్ట అని బీఆర్ఎస్ పార్టీ నాయకులు మండిపడ్డారు.
జైనూర్, జూన్ 02: కాగజ్‌నగర్‌లో జరిగిన ప్రభుత్వ సభలో స్థానిక ఆదివాసీ ఎమ్మెల్యే కోవ లక్ష్మి(Kova Laxmi)ని ప్రోటోకాల్ ప్రకారం గౌరవించకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వం అహంకారానికి పరాకాష్ట అని బీఆర్ఎస్ పార్టీ నాయకులు మండిపడ్డారు. ప్రోటోకాల్ ఉల్లంఘనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే ఆదివాసీ ఎమ్మెల్యే కోవ లక్ష్మికి, ఆదివాసీ సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ కనకయద రావు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో గిరిజన ఆత్మగౌరవాన్ని కించపరిచిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని ఆయన పేర్కొన్నారు.
కాగజ్ నగర్ సభలో కోవ లక్ష్మికి కనీసం మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకపోవడంపై బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం జైనూరు మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ కనకయద రావు మాట్లాడుతూ.. ప్రభుత్వ కార్యక్రయాన్ని కాంగ్రెస్ పార్టీ రాజకీయ సభగా మార్చిందని, ప్రజలు ఎన్నుకున్న ఆదివాసీ మహిళా ఎమ్మెల్యేను వేదికపైన అవమానించడం అత్యంత దుర్మార్గమైన చర్య అని వారు అన్నారు. నియోజకవర్గ ప్రజల సమస్యలను ముఖ్యమంత్రి ముందు ప్రస్తావించే అవకాశం ఇవ్వకుండా కోవ లక్ష్మిని అడ్డుకోవడం వెనక కాంగ్రెస్ ప్రభుత్వం తమ వైఫల్యాలను కప్పిపుచ్చాలనే ఉద్దేశముందని వారు విమర్శించారు.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో మహిళలకు నెలకు రూ.2500, రైతులకు పూర్తి రుణమాఫీ, ఇందిరమ్మ ఇళ్లు, నిరుద్యోగ భృతి, గిరిజనుల అభివృద్ధి, ఎస్సీ-ఎస్టీ సంక్షేమం అంటూ హామీల వర్షం కురిపించిన కాంగ్రెస్ నాయకులు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలను పూర్తిగా విస్మరించారని బీఆర్ఎస్ నాయకులు ధ్వజమెత్తారు. ప్రజలు హామీల గురించి ప్రశ్నిస్తారనే భయంతోనే స్థానిక ఎమ్మెల్యేకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని వారు ఆరోపించారు. ఆదివాసీ ఎమ్మెల్యే కోవ లక్ష్మిని అవమానించడం అంటే యవాత్ ఆదివాసీ సమాజాన్ని అవమానించినట్టేనని వారు తెలిపారు.
ఎన్నికల సమయంలో ఆదివాసుల ఓట్లు కావాలి. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆదివాసీ ప్రజా ప్రతినిధులకు గౌరవం అవసరం లేదా? అని బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షుడు లాలా , మాజీ గ్రంథాలయ చైర్మన్ కనక యాదవరావు , ఆత్రం శంకర్, కోలాం శివనూర్ సర్పంచ్. జాదవ్ శ్రావణ్, మెస్రం రాహుల్, PACS మాజీ చైర్మన్ హన్ను పటేల్ ముండే సతీష్, సయ్యద్ ముషా, మాడవి నగేష్, జాదవ్ మోహన్, సిడం మాన్కు, పూసం మారు, దశరథ్, బతనే వెంకటి, ఉపసర్పంచ్ శివాజీ, తొడసం బిర్షావ్, ఖలీల్, కలీమ్, ఫాజిల్, జుగాదిరావు, కన్నీరామ్, భూమన్న తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad Adilabad News in Telugu and Telugu News
- Tags
- BRS
- kagaznagar
- Kova Laxmi
- protocol
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Protest | రైతులకు 24 గంటల కరెంటు ఇవ్వాలి.. చెల్పూరులో జాతీయ రహదారిపై బీఆర్ఎస్ ధర్నా
Niti Taylor | సినిమా అవకాశం కోసం అసభ్యకరమైన షరతు.. చేదు అనుభవాన్ని బయటపెట్టిన నీతి టేలర్!
ట్రాక్టర్ టైరు కిందపడి వ్యక్తి దుర్మరణం.. మెదక్ జిల్లాలో విషాదం
Ranji Trophy: త్రిపురపై ఇన్నింగ్స్ 40 రన్స్ తేడాతో హైదరాబాద్ విన్
Jailer 2 | ‘జైలర్ 2’ అడ్వాన్స్ బుకింగ్స్‌లో దూకుడు.. బుక్‌మైషోలో 6 లక్షలు దాటిన టికెట్ల అమ్మకాలు!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

