వాంకిడి : ఆసిఫాబాద్ కొమురం భీమ్ జిల్లా వాంకిడి మండలంలోని ఖీర్డి గ్రామానికి చెందిన నానివేణి గణేశ్‌కు ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వాంకిడి నుంచి బైక్‌పై ఇంటికి వెళ్తున్న క్రమంలో టోల్ ప్లాజా సమీపంలో గుర్తు తెలియని వాహనం అతివేగంగా వచ్చి బైక్‌ను ఢీకొట్టింది.
ఈ ఘటనలో గణేశ్ తలకు తీవ్ర గాయాలై రక్తస్రావంతో స్పృహతప్పి కిందపడ్డాడు. స్థానికులు గమనించి అంబులెన్స్‌లో ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి కరీంనగర్ తరలించారు.