ఉత్తర్వులు వెలువరించిన సర్కారు
ఉమ్మడి జిల్లాలో 186 ఖాళీలు
కళాశాలల్లో తీరనున్న బోధన సమస్యలు
కుమ్రం భీం ఆసిఫాబాద్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో గెస్ట్ లెక్చరర్ల నియామకానికి సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కరోనా కారణంగా మూతబడిన విద్యాసంస్థలు తిరిగి ప్రారంభించగా, ఇప్పటికే రెగ్యులర్ సిబ్బందితో పాటు కాంట్రాక్టు సిబ్బందిని సర్కారు విధుల్లోకి తీసుకున్నది. తాజాగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 186 అతిథి అధ్యాపక పోస్టుల భర్తీకి ఉత్తర్వులు వెలువరించగా, సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తగా 42 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. వీటిలో లాక్డౌన్కంటే ముందు 186 మంది గెస్ట్ లెక్చరర్లుగా పనిచేశారు. ఆదిలాబాద్ జిల్లాలోని 12 జూనియర్ కళాశాలల్లో 50 మంది, నిర్మల్ జిల్లాలోని 10 కళాశాలల్లో 43 మంది, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ని 11 కళాశాలల్లో 39 మంది, మంచిర్యాల జిల్లాలోని 9 కళాశాలల్లో 54 మంది గెస్ట్ అ ధ్యాపకులుగా పనిచేసేవారు. లాక్డౌన్తో వి ద్యాసంస్థలు మూతపడడంతో వీరిని తొలగించారు. ప్రభుత్వం తిరిగి విద్యాసంస్థలను ప్రా రంభించడంతో మళ్లీ గెస్ట్లెక్చరర్లను తీసుకునేందుకు సర్కారు కసరత్తు ప్రారంభించింది. రాష్ట్ర వ్యాప్తంగా 1654 మంది గెస్ట్లెక్చరర్ల నియామకానికి ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించగా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 186 పోస్టులు భర్తీ కానున్నాయి.
తీరనున్న బోధన సమస్యలు
జూనియర్ కళాశాలల్లో గెస్ట్లెక్చరర్ల నియామకంతో కళాశాలల్లో బోధనాపరమైన సమస్యలు తీరిపోనున్నాయి. జిల్లా వ్యాప్తంగా 11 ప్రభు త్వ జూనియర్ కళాశాలల్లో సుమారు 9,748 మంది విద్యార్థులు విద్యసభ్యసిస్తున్నారు. లా క్డౌన్ అనంతరం ప్రభుత్వం అన్ని విద్యాసంస్థలను ప్రారంభించింది. జిల్లాలోని ప్రభుత్వ కళాశాలల్లో విద్యాబోధన రెగ్యులర్ అధ్యాప కులతో పాటు కాంట్రాక్టు, గెస్ట్ లెక్చరర్లపైనే ఆధారపడి సాగుతోంది. కళాశాలలను పునఃప్రారంభమైనప్పటి నుంచే కాంట్రాక్టు లెక్చర్లను విధుల్లోకి తీసుకున్న ప్రభుత్వం నెల రో జుల అనంతరం గెస్ట్లెక్చరర్లను విధుల్లోకి తీసుకునేందుకు చర్యలు చేపట్టింది.
సర్వత్రా హర్షం
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో గెస్ట్లెక్చర్లను తీసుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టడంతో అతిథి అధ్యాపకుల్లో హర్షం వ్యక్తమవుతోంది. లాక్డౌన్ కారణంగా కళాశాలలు మూ తపడడంతో అనేక ఇబ్బందులు పడుతున్నామని, ప్రభుత్వం తిరిగి తమను విధుల్లోకి తీసుకుంటున్నందుకు సంతోషంగా ఉందని వారు పేర్కొంటున్నారు.