ప్రభుత్వ విప్ బాల్క సమన్
చెన్నూర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కార్యక్రమం
నియోజకవర్గంలోని 122 మంది లబ్ధిదారులకు చెక్కుల అందజేత
ఎల్లక్కపేటలో మెగాపార్కు సందర్శన
దండేపల్లి, ఆగస్టు 25 : చెన్నూర్, ఆగస్టు 25 : నిరుపేద ఆడబిడ్డల కోసమే తెలంగాణ ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను అమలు చేస్తున్నదని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో చెన్నూర్ మున్సిపాలిటీతో పాటు చెన్నూర్, కోటపల్లి, భీమారం, జైపూర్ మండలాల్లోని 122 మంది లబ్ధిదారులకు చెక్కులను బుధవారం పంపిణీ చే శారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేద తల్లిదండ్రులకు తమ ఆడపిల్లలు భారం కాకూడదనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ రూ లక్షా 116 ఆర్థిక సాయం అందించి ఆదుకుంటున్నారన్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్ బత్తుల సమ్మయ్య, జడ్పీటీసీ మోతె తిరుపతి, ఎంపీపీ మం త్రి బాపు, మున్సిపల్ చైర్పర్చన్ అర్చనా గిల్డా, వైస్ చైర్మన్ నవాజొద్దీన్, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.
174 మందికి అందజేసిన ఎమ్మెల్యే దివాకర్‌రావు..
మండలకేంద్రంలోని జడ్పీ పాఠశాలలో మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు 174 మం ది లబ్ధిదారులకు రూ.1.74 కోట్ల విలువైన కల్యాణలక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా సంక్షోభంలోనూ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ గడ్డం శ్రీనివాస్, రైతుబంధు సమితి కన్వీనర్ గురువయ్య, పీఏసీఎస్ చైర్మన్లు కాసనగొట్టు లింగన్న, సురేశ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రేని శ్రీనివాస్, వైస్ ఎం పీపీ అనిల్, తహసీల్దార్ హన్మంతరావు, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు చుంచు శ్రీనివాస్, సర్పంచ్‌లు గడికొప్పుల రజి నీ, కందుల కల్యాణి, విఠల్, జాడి తిరుపతి, డాంక లక్ష్మణ్, పుష్పలత, ఎంపీటీసీ ముత్తె రాజన్న, బోడ అమృతాబా యి, టీఆర్ఎస్ నాయకులు ఆకుల రాజేందర్, గోళ్ల రాజమల్లు, శంకర్రావు, సురేందర్, శ్రీనివాస్, జాడి రాజన్న , సత్యం, రమేశ్, మహేశ్, వేణు, అజయ్, సంతోష్, భూమన్న, అఫ్సర్, రమణయ్య ఉన్నారు.
మెగా పార్కులపై ప్రత్యేక దృష్టి పెట్టాలి
చెన్నూర్ రూరల్, అగస్టు 25: మెగా పార్కులపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అ న్నారు. చెన్నూర్ మున్సిపల్ పరిధిలోని ఎల్లక్కపేటలోని మె గా పార్కులో ఆయన బుధవారం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పార్కును అహ్లాదకరంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని, సుమారు 30 వేల మొక్కలు నాటి సంరక్షించాలని, కూర్చీలతో పాటు పిల్లల కోసం ఆట వస్తువులు ఏ ర్పాటు చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ మంత్రి బాపు, జడ్పీటీసీ మోతె తిరుపతి, మున్సిపల్ చైర్మన్ అర్చన గిల్డా, వైస్ చైర్మన్ నవాజ్, మార్కెట్ కమిటీ చైర్మణ్ బత్తుల సమ్మయ్య, పీఏసీఎస్ చైర్మన్ చల్ల రాంరెడ్డి, పార్టీ మండలాధ్యక్షుడు మల్లెల దామోదర్ రెడ్డి, వైస్ ఎంపీపీ వెన్నపు రెడ్డి బాపురెడ్డి, సర్పంచ్ బుర్ర రాకేశ్ గౌడ్ చెన్నూర్ పట్టణ కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.
వివాహ వేడుకలకు విప్ సుమన్ హాజరు
మందమర్రి ఆగస్టు 25: సాయిమిత్ర గార్డెన్లో టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు బత్తుల శ్రీనివాస్ కు మారుడి వివాహం బుధవారం జరిగింది. ప్రభుత్వ విప్ బాల్క సుమన్ హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ఆయనతో పాటు ఎమ్మెల్సీ పురా ణం సతీశ్ కు మార్, మాజీ ఎమ్మెల్యే, మాజీ విప్ నల్లాల ఓదెలు, టీఆర్ఎస్, టీబీజీకేఎస్ అ నుబంధ సంఘాల నా యకులు కూడా ఉన్నారు.