
ఎవరు అడ్డుకున్నా చేసి తీరుతాం..
కాంగ్రెస్, టీడీపీల హయాంలో ప్రగతి శూన్యం
మాది రైతు సంక్షేమ సర్కార్
అభివృద్ధిని చూసే చేరికలు
ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న
ఆదిలాబాద్ రూరల్, ఆగస్టు 12 : పొచ్చెర గ్రామా న్ని అభివృద్ధి చేసి తీరుతామని, ఎవరు అడ్డుపడ్డా అభివృద్ధి ఆగదని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. మండలంలోని పొచ్చెర ఉపసర్పంచ్ రామన్న, వార్డుమెంబర్ అశోక్ గురువారం టీఆర్ఎస్లో చేరగా.. వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో పేద, బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రభు త్వం పల్లె ప్రగతి పేరుతో ప్రత్యేకంగా నిధు లు కేటాయిస్తూ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నదన్నారు. స్వా తంత్య్రం వచ్చినప్పటి నుంచి సుమా రు 73 ఏండ్లు కాంగ్రెస్, బీజేపీ, టీడీపీలే అధికారంలో ఉన్నా పొచ్చెర గ్రామం అభివృద్ధికి ఎందుకు నోచుకోలేదో ఆ నా యకులనే అడగాలన్నారు. ఎవరు అడ్డుపడ్డా టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పొచ్చెరను అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని స్పష్టంచేశారు. పేదలకు కార్పొరేట్ స్థాయి విద్య అందించడానికి ప్ర త్యేకంగా గురుకులాలను ఏర్పాటు చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీల్లోని పేద విద్యార్థులకు ఆంగ్లమాద్యమ విద్యను కేజీ నుంచి పీజీవరకు అందిస్తున్నామన్నారు. ఒక్కో విద్యార్థికి రూ.1.25 లక్షలు ఖరు చేస్తున్నట్లు తెలిపారు. టీఆర్ఎస్ ప్ర భుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఇతర పార్టీల నాయకులు టీఆర్ఎస్లో చేరుతున్నారన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమ లు చేస్తున్నదని, కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఇలాంటి సంక్షేమ పథకాలు ఎక్కడున్నాయని ప్ర శ్నించారు. కార్యక్రమంలో రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు అడ్డి భోజారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్, వైస్‌ఎంపీపీ రమేశ్, నాయకులు జగదీశ్, కొడప సోనేరావ్, అల్లూరి రమేశ్‌రెడ్డి, ఆరె నరేశ్, గంగాధర్ పాల్గొన్నారు.