యాసంగిలో రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోళ్లు
గతంలో ఎన్నడూ లేనంతగా మార్కెట్లను ముంచెత్తిన వడ్లు
ప్రతి గింజనూ కొని మద్దతు ధర కల్పించిన రాష్ట్ర సర్కారు
చెల్లింపుల్లో పారదర్శకత l37,153 మంది రైతులకు మేలు
యాసంగి సీజన్(2020-21)లో రాష్ట్ర సర్కారు రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోళ్లు చేపట్టింది. జిల్లాలో లక్షా 13 వేల ఎకరాల్లో వరి సాగు కాగా, 2.20 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందన్న వ్యవసాయశాఖ అంచనాకు మించి 2.22 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మార్కెట్లోకి వచ్చింది. 37,153 మంది రైతుల వద్ద మద్దతు ధరకు వడ్లుకొని రూ. 420.68 కోట్లు చెల్లించింది. సీఎం కేసీఆర్ ఆదేశాలతో అప్రమత్తమైన యంత్రాంగం ముందస్తు వ్యూహంతో ముందుకెళ్లగా, అన్నదాతలకు మేలు చేకూరింది. – మంచిర్యాల అర్బన్, సెప్టెంబర్ 30
మంచిర్యాల అర్బన్, సెప్టెంబర్ 30 : ఈ యాసంగి సీజన్(2020-21)లో జిల్లాలో విస్తృతంగా పెరిగిన పంటల సాగు తో ప్రభుత్వం ముందు నుంచే అప్రమత్తమై ఇబ్బందులు లే కుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంది. యాసంగి ప్రా రంభం నుంచి పంట కొనుగోళ్ల వరకు అణువణువునూ ముఖ్యమంత్రి కేసీఆరే స్వయంగా సమీక్షించి పౌరసరఫరాలు, గ్రామీణాభివృద్ధి, మార్కెటింగ్, వ్యవసాయ శాఖలను నిత్యం అప్రమత్తం చేశారు. ధాన్యం భారీ స్థాయిలో రావడంతో ప్రతీ గింజ నూ కొనుగోలు చేసేందుకు పకడ్బందీగా చర్యలు తీసుకున్నా రు. జిల్లాలో యంత్రాంగం తీసుకున్న ముందస్తు వ్యూహాలు ఫలించడంతో రైతులంతా మద్దతు ధర పొంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
బీడు భూములన్నీ పచ్చని పొలాలుగా..
‘మిషన్ కాకతీయ’తో చెరువుల్లో పుష్కలంగా నీళ్లు ఉండడం.. కడెం ప్రాజెక్టు ద్వారా పంట పొలాలకు నీరందడం, గూడెం ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని అందించడంతో మంచిర్యాల జిల్లాలో మునుపెన్నడూ లేని విధంగా యాసంగి సాగైంది. బీడు భూములన్నీ పచ్చని పంట పొలాలుగా మారాయి. దిగుబడులు భారీ స్థాయిలో రానున్నాయని భావించిన తెలంగాణ ప్రభుత్వం ప్రతీ గింజనూ కొనుగోలు చేసి మద్దతు ధర కల్పించేందుకు పకడ్బందీ చర్యలు తీసుకుంది. ధాన్యాన్ని కొనడం, ట్యాబ్‌లలో వివరాలు నమోదు చేయడం, రైతు ఖాతాల్లో డ బ్బులు వేయడం, సేకరించిన ధాన్యాన్ని గోదాములకు తరలించడంవంటి పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి కావడంతో రైతులకు మేలు చేకూరింది. గతేడాదికంటే ఈసారి రికార్డు స్థాయిలో 2 లక్షల 22 వేల 991 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి రూ. 420.68 కోట్లు రైతులకు చెల్లించింది.
రూ. 420.68 కోట్ల చెల్లింపుతో రికార్డు..
జిల్లాలోని 18 మండలాల్లో లక్షా 13 వేల ఎకరాల్లో వరి సాగైంది. గతంలోకంటే భిన్నంగా రెట్టింపు స్థాయిలో దిగుబడు లు వచ్చాయి. అయినా ప్రభుత్వం వెనుకడుగు వేయకుండా చెల్లింపుల్లో రికార్డు సృష్టించింది. జిల్లాలో వ్యవసాయ శాఖ దాదాపు 2.20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అం చనా వేయగా 2.22 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మార్కెట్లోకి వచ్చింది. సర్కారు ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా 37 వేల 153 మంది రైతుల వద్ద 2,22,990.960 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వ యంత్రాంగమే సేకరించింది. ప్రభుత్వంపై నమ్మకంతో వచ్చిన ధాన్యాన్ని వెనక్కి పంపకుండా సర్కారు మాత్రం పూర్తి స్థాయిలో కొనుగోలు చేసింది. దీనికిగాను జిల్లాలో రూ. 420 కోట్ల 68 లక్షల 27 వేల 893 చెల్లించడం విశేషం. ధాన్యం సేకరించిన 48 గంటల్లోనే చెల్లింపులు జరిగేలా పౌరసరఫరాల శాఖ చర్యలు తీసుకుంది. ధాన్యం తరలింపులో ఇబ్బందులు ఎదురైన సందర్భంలోనే డబ్బుల చెల్లింపులు ఆలస్యం కాగా, మిగితా రోజుల్లో సాఫీగానే ప్రక్రియ ముందుకెళ్లింది.
గత యాసంగిలో 1.99 లక్షల మెట్రిక్ టన్నులే..
గత(2019-20) ఎండాకాలం సీజన్లో జిల్లాలో మొత్తం 36,405 మంది రైతుల లక్షా 99 వేల 856.200 మెట్రిక్ ట న్నుల ధాన్యాన్ని సేకరించారు. వీరికి రూ. 366.66 కోట్లు వెచ్చించారు. ఈ ఏడాది ప్రభుత్వం జిల్లాలోనే గతానికి భిన్నంగా రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోళ్లకు డబ్బులు చెల్లించింది. గతేడాది 250 కొనుగోలు కేంద్రాలు కేటాయించగా, ఈ ఏడాది సైతం 250 కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరించారు. ఇందులో డీఆర్డీఏ (ఐకేపీ) 77 కేంద్రాల ద్వారా 55,167.520 మెట్రిక్ టన్నులు, పీఏసీఎస్ 121 కేంద్రాల ద్వారా 85,979.880 మెట్రిక్ టన్నులు, డీసీఎంఎస్ 52 కేంద్రాల ద్వారా 81,843.560 మెట్రిక్ టన్నుల ధాన్యం రైతుల వద్ద నుంచి సేకరించి రైతులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా చూశారు.
సమన్వయంతోనే సాధ్యమైంది
ప్రభుత్వ ఆదేశాల మేరకు ధాన్యం కొనుగోళ్ల కోసం ముందు నుంచే అప్రమత్తంగా ఉన్నాం. వ్యవసాయ శాఖ అంచనాల మేరకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. అనుకున్నట్లే గతేడాది యాసంగికంటే అధికంగా పంట ఉత్పత్తులు రావడంతో కలెక్టర్ భారతీ హో ళికేరి, అదనపు కలెక్టర్ మధుసూదన్ నా యక్ ఆదేశాలతో రవాణాశాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ, సహకార శాఖ, మా ర్కెటింగ్ శాఖ, రెవెన్యూ, పోలీసు శాఖలతో సమన్వయం చేసుకుంటూ ధాన్యాన్ని సేకరించాం. అలాగే యాసంగి ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి పూర్తి స్థాయిలో చెల్లింపులు జరిపాం. సాంకేతిక కారణాలతో కొం తమంది రైతుల నగదు ఖాతాలో జమకాకుంటే ఖాతాలను సరి చేసి వాటిని సైతం పరిష్కరించాం. ఈ రోజు(గురువారం)తో 2020-21 యాసంగి సీజన్ పూర్తయింది. అక్టోబర్ ఒకటి నుంచి 2021-22 వాన కాలం సీజన్ ప్రా రంభం కానున్నది. వచ్చే సీజన్ కోసం ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం.