దస్తురాబాద్, డిసెంబర్ 5 : సంకల్పం ఉంటే ఏది అసాధ్యం కాదు. పుట్టుకతోనే అంగవైకల్యం ఉన్నా.. ఆత్మవిశ్వాసం, కృషి, పట్టుదలతో ముందుకు సాగుతున్నాడు దస్తురాబాద్ మండ లం మున్యాల గ్రామానికి చెందిన 29 ఏండ్ల సంతపూరి కిరణ్ కుమార్. ఇతడికి పుట్టుకతోనే ఎడమ చేయి మణికట్టు పని చేయదు. అయినా బాధపడలేదు. అటు చదువుకుంటూ..క్రికెట్ బ్యాట్ పట్టి సాధన చేసి ఏకంగా తెలంగాణ పారా క్రికెట్ జట్టుకు ఎంపికయ్యారు. నాలుగు సార్లు జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని ఆల్ రౌండర్‌గా పేరు పొందారు. పట్టుదలతో చదివి జాతీయ స్థాయిలో నిర్వహించే ఐబీపీఎస్ పరీక్షలో ఉత్తీర్ణుల య్యారు. ఆర్థో కోటలో 2021లో ఉద్యోగం సాధించాడు. ప్రస్తుతం ఆదిలాబాద్‌లోని బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అసిస్టెంట్ మేనేజర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. మున్యాల గ్రామానికి చెందిన సంతపూరి గంగారాజం-వరలక్ష్మికి ఇద్దరు కొడు కులు, ఒక కూతురు. వీరిది వ్యవసాయ కుటుంబం. వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. సంతపూరి గంగారాజం-వరలక్ష్మికి కిరణ్ కుమార్ పెద్ద కొడుకు. అంగవైకల్యంతో జన్మించినా దిగులు చెందలేదు. అతడిని చదివించి ఉన్నత స్థానంలో ఉండేలా చేశారు. తల్లిందడ్రుల నమ్మకాన్ని పేరును నిలబెట్టి గ్రామం గర్వించే విధంగా కిరణ్ కుమార్ ఉద్యోగం చేస్తూ జాతీయ స్థాయిలో క్రీడాల్లో రాణిస్తున్నాడు.
ఐదో సారి ఆడేందుకు సన్నద్ధం..
అటు చదువుకుంటూ ఇటు క్రీడల వైపు ఆసక్తి పెంచుకున్నాడు కిరణ్ కుమార్. 1వ తరగతి నుంచి 6 వ తరగతి వరకు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చదివాడు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని శిశుమందిర్‌లో(2008) పదో తరగతి పూర్తి చేశాడు. దీక్ష కాలేజ్‌లో ఇంటర్(2010)లో పూర్తి చేశాడు. 2010లో ఎంసెట్ ఎంట్రెన్స్ రాశాడు. హైదరాబాద్‌లోని వాసవి ఇంజినీరింగ్ కాలేజ్ లో (2010-2014) అభ్యసించి 2014లో బీటెక్ పూర్తి చేశాడు. 2020-2021 సంవత్సరంలో ఐబీపీఎస్ పరీక్షను రెండు సార్లు రాసి ఉత్తీర్ణతను సాధించాడు. 2021లో బ్యాంక్ ఆఫ్ ఇండియా అసిస్టెంట్ మేనేజర్‌గా ఉద్యోగాన్ని సాధించాడు. 4 సార్లు జాతీయ స్థాయిలో క్రికెట్ ఆడారు. మహా రాష్ట్రలోని నాగ్‌పూర్ (2007), కేరళ (2009), మధ్యప్రదేశ్ (2018), హైదరాబాద్ (2019)లో నిర్వహించిన జాతీయ స్థాయి క్రికెట్ పోటీల్లో పాల్గొని తన ప్రతిభ చాటాడు. ఐదో సారి జాతీయ స్థాయిలో క్రికెట్లో ఆడేందుకు సిద్ధవుతున్నాడు. త్వరలో జాతీయ స్థాయి పారా క్రికెట్ పోటీలు ఉండడంతో ఆదిలాబాద్ జిల్లా కేంద్రం లోని జేసీ ఆకాడమీలో సాధన చేస్తున్నాడు.
భారత క్రికెట్ జట్టులో ఆడాలని..
జీవితంలో ఉన్న తమైన ఉద్యోగం చేయాలనే తప న ఉంది. దివ్యాంగ విభా గంలో భారత క్రికెట్ జట్టుకు ఆడాలనే ఆకాం క్ష. ఉద్యోగం, ఆటలో ఉన్నతంగా రాణించాలని ఉంది. తోటి మిత్రుల కృషితో ముందుకెళ్తున్నా. క్రికెట్‌పై ఆసక్తి ఉండ డంతో ఎలాగైనా ఆడాలని చదువుకునే సమ యంలో సాధన చేసేవాడిని. పట్టుదల. ఆత్మైస్థెర్యంతో ముందుకెళ్తు న్నా.తల్లిదండ్రులు నాపై పెట్టుకున్నా నమ్మకాన్ని నిలబెట్టుకుంటా. సహా ఉద్యోగులు, ప్రజాప్రతి నిధులు సహకరించాలి..
– సంతపూరి కిరణ్ కుమార్