ఉట్నూర్ రూరల్, నవంబర్ 26 : రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి ఇతర పార్టీల నాయకులు టీఆర్ఎస్(బీఆర్ఎస్)లో చేరుతున్నారని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం బీర్సాయిపేట గ్రామం లో శనివారం ఆమె పర్యటించారు. గ్రామానికి చెందిన వివిధ పార్టీల నాయకులు, మహిళలు మొత్తం 50 మంది ఆమె సమక్షంలో టీఆర్ఎస్(బీఆర్ఎస్)లో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అలాగే గ్రామంలో ఐకేపీ మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.
కార్యక్రమంలో సర్పంచ్ అంకవ్వ, కోఆప్షన్ సభ్యుడు రషీద్, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు అజీమొద్దీన్, ఏపీఎం అనిల్, సీసీ స్వప్న, టీఆర్ఎస్(బీఆర్ఎస్) మండలాధ్యక్షుడు రమేశ్, సీనియర్ నాయకుడు సీతారాం, అన్సారీ, పోశన్న, రవి, ఆశన్న, గంగరాజు, మహేందర్, ఐకేపీ సిబ్బంది, నాయకులు, మహిళా సంఘాల సభ్యులు, రైతులు పాల్గొన్నారు.
అన్ని రంగాల్లో యువత ముందడుగువేయాలి
ఉట్నూర్, నవంబర్ 26 : అన్ని రంగాల్లో యువత ముందడుగు వేయాలని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ అన్నారు. మండల కేంద్రంలో రవి ఏర్పాటు చేసిన మొబైల్ టిఫిన్ సెంటర్ను ఆమె ప్రారంభించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్(బీఆర్ఎస్) మండలాధ్యక్షుడు కందుకూరి రమేశ్, నాయకులు సయ్యద్ రషీద్, అహ్మద్ అజీమ్, పోశన్న, సోనేరావ్, జాడి వెంకటేశ్ పాల్గొన్నారు.