కడెం, ఏప్రిల్ 11 : రాష్ట్ర ప్రభుత్వం పేదల కోసం కడెంలో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం పూర్తికాగా, వాటి పంపిణీ విషయంలో పారదర్శకత పాటిస్తామని నిర్మల్ కలెక్టర్ వరుణ్‌రెడ్డి, ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్ అన్నారు. కడెంతో పాటు మండలంలోని కన్నాపూర్ పంచాయతీల్లో డబుల్ బెడ్ రూం ఇండ్లకు సంబంధించిన గ్రామసభలను మంగళవారం నిర్వహించారు. అంతకుముందు కడెం జీపీ కార్యాలయంలో మహాత్మా జ్యోతిబా ఫూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్, ఎమ్మెల్యే మాట్లాడారు. కడెంలో మొత్తం 200 డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. పూర్తి నాణ్యతా ప్రమాణాలతో నిర్మించిన ఈ ఇండ్ల పంపిణీకి సంబంధించి కడెం పంచాయతీకి 150 ఇండ్లు, కన్నాపూర్ పం చాయతీకి 50 ఇండ్లను కేటాయించినట్లు పేర్కొన్నారు. ఇప్పటికే వీటికి సంబంధించిన దరఖాస్తు లు స్వీకరించిన అధికారులు.. రెండుసార్లు ఇం టింటా సర్వేలు పూర్తి చేసినట్లు తెలిపారు.
ఈ ఇండ్ల పంపిణీలో కొంతమంది నిరాశకు గురికావడంతో తిరిగి మరోసారి గ్రామసభ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కడెంలో ఇప్పటి వరకు నీటి పా రుదలశాఖకు సంబంధించిన స్థలాల్లోనే ప్రజలు తాత్కాలిక ఇండ్లు నిర్మించుకొని జీవిస్తున్నారని, వాటిని క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం 2016 లోనే జీవో నంబర్ 58, 59లను విడుదల చేసి దరఖాస్తులు తీసుకున్న విషయాన్ని గుర్తు చేశా రు. ఈ నెల 30వ తేదీ వరకు దరఖాస్తులకు గడువున్నట్లు తెలిపారు. డబుల్ బెడ్ రూం ఇండ్ల విషయంలో ప్రజలకు ఏమైనా అభ్యంతరాలుంటే పంచాయతీ కార్యాలయాల్లో ఫిర్యాదుల పెట్టెను ఏర్పాటు చేశామని, ఇందులో ఫిర్యాదు పత్రాలను వేయవచ్చన్నారు. అనంతరం కన్నాపూర్ పంచాయతీలో గతంలో 266 సర్వే నంబర్లో వంద మందికి పైగా ఇంటి స్థలాలను కేటాయించారని, ఇప్పుడు అక్కడ స్థలాలు తీసుకున్న వా రికి కూడా తిరిగి ఇండ్లు ఇచ్చేందుకు జాబితాలో పేర్లు రావడంతో గ్రామస్తులు ఆందోళన చేశారు. దీంతో కలెక్టర్, ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఇండ్లు, స్థలాలు లేని వారిని క్షుణ్ణంగా గుర్తించి వారికి మాత్రమే ఇండ్లు ఇచ్చేలా రీసర్వేలు చేయాలని అధికారులను ఆదేశించారు.
అనంతరం అక్కడి నుంచి కడెం ఎంపీడీవో కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్షా స మావేశంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాల్లో జడ్పీటీసీ పురపాటి శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీపీ అలెగ్జాండర్, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు నల్ల జీవన్‌రెడ్డి, బీఆర్ఎస్ ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి మెలుగూరి రాజేశ్వర్‌గౌడ్, వైస్ ఎం పీపీ కట్టా శ్యాంసుందర్, సర్పంచ్‌లు కొండపు రం అనూష, నరేందర్‌రెడ్డి, జడ్పీ కో-ఆప్షన్ స భ్యుడు రఫీక్ హైమద్, సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు గోళ్ల వేణుగోపాల్, తహసీల్దార్ చిన్న య్య, ఎంపీడీవో వెంకటేశ్వర్లు, పంచాయతీ కా ర్యదర్శులు, వార్డు సభ్యులు మంచినీళ్ల వనిత, ప డిగెల రాజనర్సయ్య, లింగంపెల్లి సుశీల, శనిగారపు రాధ, భూత్కూర్ మల్లేశ్, ఆయా గ్రామాల నాయకులు, అధికారులు పాల్గొన్నారు.