ఎదులాపురం,మార్చి19: బీఆర్ఎస్పార్టీలో భారీగా చేరికలు కొనసాగుతున్నాయి. ఖానాపూర్కు చెందిన ఎంఐఎం పార్టీ ముఖ్యమైన నాయకుడు అన్సారీ, తబ్రేస్తో పాటు 500 మంది యువకులు, కాలనీ వాసులు ఆదివారం గులాబీ కండువా కప్పు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ముందుగా మసూద్చౌక్ నుంచి భారీ సంఖ్యలో నాయకులు, కాలనీ వాసులతో ర్యాలీ నిర్వహించారు. గుస్సాడీ నృత్యాలు, డీజే, బ్యాండ్ మేళాలతో, గజమాలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అక్కడే ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే జోగు రామన్న మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు చూసి వివిధ పార్టీల నుంచి పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్కు క్యూ కడుతున్నారని చెప్పారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా తమ పార్టీ ముందుకెళ్తున్నదని తెలిపారు. నేడు తెలంగాణ దేశానికే దిక్సూచిగా మారిందన్నారు. బీజేపీ ప్రభుత్వం వంట గ్యాస్ ధరలు పెంచడంతో ప్రజలు ఎంతో ఇబ్బందులు పడుతున్నారని గుర్తుచేశారు. మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజానీ, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు అలాల అజయ్, దుర్గంట్రస్ట్ చైర్మన్ దుర్గం శేఖర్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బండారి సతీశ్, బీసీ పట్టణాధ్యక్షుడు దాసరి రమే శ్, వార్డు కౌన్సిలర్లు, నాయకులు, తదితరులున్నారు.