KGBV | కోటపల్లి, జూన్ 10 : మంచిర్యాల జిల్లా కోటపల్లి కస్తూర్బా బాలికల విద్యాలయంలో 2025-26 విద్యా సంవత్సరం ఇంటర్మీడియట్ బైపీసీ ఆంగ్ల మాధ్యమంలో బోధించేందుకు తాత్కాలిక పద్ధతిలో బోధించడానికి అర్హులైన అధ్యాపకులు దరఖాస్తు చేసుకోవాలని కళాశాల స్పెషల్ ఆఫీసర్ హరిత ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 12,13 తేదీలలో వారి ఒరిజినల్ విద్యార్హతల ధ్రువీకరణ పత్రాలతో కస్తూర్బా గాంధీ పాఠశాలలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
తెలుగు, ఇంగ్లీష్, బొటనీ, జువాలజీ, ఫిజికల్ సైన్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులో పీజీతో పాటు బీఎడ్ ఉత్తీర్ణత పొంది ఉండాలి. టెట్ క్వాలిఫై అయి ఉండాలి. ఆంగ్ల మాధ్యమం ఉండి అనుభవం కలిగిన వారికి మొదటి ప్రాధాన్యత ఇవ్వబడుతుందన్నారు. మరిన్ని వివరాలకు కోటపల్లి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో నేరుగా సంప్రదించాలని కోరారు.