ఇంద్రవెల్లి : బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు( KCR ) జన్మదిన వేడుకలను ఇంద్రవెల్లి ( Indravelli ) మండల కేంద్రంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. పార్టీ మండల అధ్యక్షుడు మారుతిపటేల్ డొంగ్రే ఆధ్వర్యంలో నాయకులు కేక్ కట్ చేసి కేసీఆర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు
.‘జై కేసీఆర్..జై తెలంగాణ అంటూ కార్యకర్తల నినాదాలతో పరిసరాలు మారుమోగాయి. అనంతరం కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, ప్రజల కోసం మరిన్ని సేవా కార్యక్రమాలు చేసే శక్తి ఆయనకు లభించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు,బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.