జైనథ్, మే 4 : సనాతన హిందూ ధర్మ ప్రాశస్త్యాన్ని భావి తరాలకు తెలియ చేయాల్సిన బాధ్యత ప్రతి ఒకరిపై ఉందని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. భోరజ్ మండలంలోని సిర్సన్న గ్రామంలో నూతనంగా నిర్మించిన రేణుక మాత ఆలయ విగ్రహ ప్రతిష్ఠాపన వేడుకల్లో పాల్గొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆలయ నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. విగ్రహ ప్రతిష్ఠాపన ఉత్సవాల్లో భాగంగా హోమాది క్రతువులను భక్తిశ్రద్దలతో జరిపారు.
గ్రామస్తులు, మహిళలు భారీ సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలతో అమ్మవారిని కొలిచారు. ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఆలయ నిర్మాణానికి నిధులు మంజూరు చేయించడంతోపాటు అన్నదాన కార్యక్రమానికి రూ.50 వేలు అందించడంతో నిర్వాహకులు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు రామన్న మాట్లాడుతూ.. ఆలయ నిర్మాణానికి సిర్సన్న నాట్య మండలి వారు చేసిన కృషి అభినందనీయమన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలయాల నిర్మాణానికి విశేష ప్రాధాన్యతను ఇచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మారెట్ కమిటీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్, మద్దుల ఊశన్న, చంద్రయ్య పాల్గొన్నారు.