ఎదులాపురం, జనవరి 2 : ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న ఐటీ టవర్‌కు రూ.40 కోట్లు మంజూరు చేసిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానికే దక్కుతుందని, ఇందుకోసం మాజీ మంత్రి జోగు రామన్న ప్రత్యేక కృషి చేశారని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు. మంగళవారం ఐటీ టవర్ నిర్మాణ పనులను పరిశీలించి, అధికారులతో పలు అంశాలపై చర్చించారు. టవర్ నమూనాను పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ.. ఐటీ టవర్ పనులను ఎటువంటి అడ్డంకులు లేకుండా పూర్తి చేయించాలని, ఈ విషయంపై స్థానిక ఎమ్మెల్యే పాయల్ శంకర్ దృష్టి సారించాలని కోరారు. ఆయన వెంట వార్డు కౌన్సిలర్ పవన్ నాయక్, నాయకులు కలీమ్, సునీల్, మహేశ్, చందర్, తదితరులు ఉన్నారు.