ఎదులాపురం, ఫిబ్రవరి 20 : సీఎం కేసీఆర్‌ది సమర్థవంతమైన పాలన అని, ప్రజల ఆకాంక్ష నెరవేర్చే సత్తా ఆయనకే ఉన్నదని బీఆర్ఎస్ పార్టీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే జోగు రామన్న స్పష్టం చేశారు. పట్టణంలోని చిల్కూరి లక్ష్మీనగర్‌లో సోమవారం ఏర్పాటు చేసిన చేరికల కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హారయ్యారు. ముందుగా ఎమ్మెల్యేకు నేతలు ఘన స్వాగతం పలికారు. పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ తీశారు. ఎమ్మెల్యే కూడా నేతలతో పాల్గొని, ఉత్సాహపరిచారు.
అనంతరం బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాలనీకి చెందిన యువకులు, మహిళలు బీఆర్ఎస్లో చేరారు. వారికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం పూర్తిసహకారం అందిస్తున్నదన్నారు. ఈ మేరకు స్థానికంగా నెలకొన్న సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరిస్తున్నామని తెలిపారు. రానున్న వేసవి దృష్ట్యా ప్రజలకు నీటి ఎద్దడి తలెత్తకుండామిషన్ భగీరథ పనులను త్వరలోనే పూర్తిచేస్తున్నామని పేర్కొన్నారు. త్వరలో రూ.50 లక్షలతో రహదారి పనులు కూడా ప్రారంభం కానున్నాయని వెల్లడించారు.
పట్టణంలోని 20 వార్డుల్లో బుద్ధ విహార్ల నిర్మాణాలు జరుగుతున్నాయని గుర్తుచేశారు. ముఖ్యంగా విద్యపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ప్రతి ఒక్కరూ చదువుకునేలా విద్యార్థులకు తగిన ప్రోత్సాహం అందించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, వైస్ చైర్మన్ జహీర్ రంజాని, కౌన్సిలర్ సంద నర్సింగ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు జావిద్, నసీర్ ఖాన్, ధమ్మపాల్, విషు, భూమన్న, గోలిశంకర్, ఎజాజ్, బొడగం మమత, కస్తాల ప్రేమల, దాసరి రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
‘మన బస్తీ-మన బడి’ పాఠశాల ప్రారంభం..
ఆదిలాబాద్ టౌన్, ఫిబ్రవరి 20 : జిల్లా కేంద్రంలోని చిల్కూరి లక్ష్మీనగర్ ప్రభుత్వ పాఠశాలలో ‘మన బస్తీ-మన బడి’ పనులు పూర్తికాగా, ఎమ్మెల్యే జోగు రామన్న లాంఛనంగా ప్రారంభించారు. ముందుగా కాలనీకి వచ్చిన ఆయనకు స్థానికులు ఘన స్వాగతం పలికారు. అనంతరం అభివృద్ధి పనులకు సంబంధించి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్‌తో కలిసి తరగతి గదులను రిబ్బన్ కట్‌చేసి ప్రారంభించారు. రూ.19.41 లక్షలతో చేపట్టిన ప నులను పరిశీలించారు. విద్యార్థులతో కలిసి తరగతి గదిలో కూర్చున్నారు. కాసేపు వారితో సరదా గా ముచ్చటించారు.
మధ్యాహ్న భోజనాన్ని స్వ యంగా పరిశీలించారు. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ భోజనం అందించాలని నిర్వాహకులకు సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యతోనే సమాజంలో గుర్తింపు లభిస్తుందని, ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకుంటూ ఉజ్వల భవిష్యత్ పొందాలని విద్యార్థులకు సూచించారు. ‘మన బస్తీ-మన బడి’ కింద మొదటి విడుతగా ఎంపికచేసిన పాఠశాలల్లో అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. విద్యా రం గంలో అనేక నూతన సంస్కరణలను ప్రవేశపెట్టి నిరుపేద విద్యార్థుల ఉన్నతికి పాటుపడుతున్నట్లు స్పష్టం చేశారు. కార్యక్రమంలో డీఈవో ప్రణీ త, కౌన్సిలర్ అశోక్ స్వామి, జోహుర్ బాయ్, నాయకులు గోలి తిరుపతి తదితరులు పాల్గొన్నారు.