తాండూర్ : కార్తిక పౌర్ణమి( Karthika Pournami ) సందర్భంగా బుధవారం మంచిర్యాల జిల్లా తాండూరు మండలంలో భక్తులు, మహిళలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, సామూహిక
సత్యనారాయణ వ్రతాలు ( Satyanarayana Vratal ) నిర్వహించారు. వేకువ జామునే మహిళలు ఉసిరి, తులసి చెట్ల వద్ద దీపాలు వెలిగించడమే కాకుండా తులసి వ్రతాలను నోముకున్నారు.
మండలంలోని పలు దేవాలయాలలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సామూహిక సత్యనారాయణ వ్రతాలు నిర్వహించారు. బుగ్గ రాజరాజేశ్వర ఆలయం, నంబాల శివాలయం, గంగాపూర్ బాలాజీ ఆలయాలతో పాటు మంచిర్యాల గోదావరి నదికి తరలివెళ్లి పుణ్య స్నానాలు ఆచరించి పూజలు నిర్వహించారు.