కరంజి(టీ).. ప్రగతిలో మేటి
భీంపూర్ మండలకేంద్రానికి 35 కిలోమీటర్ల దూరాన మహారాష్ట్ర సరిహద్దున ఉన్న కరంజి(టీ) పంచాయతీ ప్రత్యేక రాష్ట్రంలో ప్రగతిలో దూసుకెళ్తున్నది. ఈ పంచాయతీకి రాజులవాడి అనే గుట్టమీద ఉన్న గిరిజన గ్రామం అనుబంధం ఉన్నది.
- అభివృద్ధిలో ఆదర్శంగా నిలుస్తున్న సరిహద్దు గ్రామం
- మెరుగైన విద్య, వైద్య సదుపాయాలు
- ఆధ్యాత్మికతతో ప్రశాంతతకు నిలయం
భీంపూర్, జనవరి 8: భీంపూర్ మండలకేంద్రానికి 35 కిలోమీటర్ల దూరాన మహారాష్ట్ర సరిహద్దున ఉన్న కరంజి(టీ) పంచాయతీ ప్రత్యేక రాష్ట్రంలో ప్రగతిలో దూసుకెళ్తున్నది. ఈ పంచాయతీకి రాజులవాడి అనే గుట్టమీద ఉన్న గిరిజన గ్రామం అనుబంధం ఉన్నది. కరంజి(టీ)కి మూడు వైపులా మహారాష్ట్ర సరిహద్దుగా కలిగి ఉన్నది. ప్రగతిలో,ఆధ్యాత్మికతలో, నాటక భాగవత కళల్లో మేటిగా నిలుస్తున్నది. రాజులవాడిని కలిపి ఈ గ్రామ జనానాభా 4 వేలు. కొత్త పంచా యతీ భవనం, వైకుంఠధామం, పల్లెప్రకృతివనం, బృహత్ వనం, క్రీడాప్రాంగణం, ఈజీఎస్ నర్సరీ తో ఆదర్శంగా నిలుస్తున్నది.
శరవేగంగా డబుల్ ఇండ్ల పనులు
ఎమ్మెల్యే బాపురావ్ ఈ పంచాయతీకి 40 డబుల్బెడ్రూం ఇండ్లు మంజూరు చేశారు. ప్రస్తు తం పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఇటీవల కొత్తగా 55 మందికి పింఛన్లు మంజూరయ్యా యి. పాతవి,కొత్తవి కలిపితే పంచాయతీలో 200 మంది పింఛన్ లబ్ధిదారులు ఉన్నారు.రైతుబంధు, ఉచిత విద్యుత్, సమీప పెన్‌గంగ, రాజులవాడి చెరువుల నీటి వనరులతో గ్రామంలోని 50 శాతం మంది రైతులు మూడు పంటలు తీస్తున్నారు.
ఆధ్యాత్మికతతో ప్రశాంతత
ఇక్కడ ప్రతి పండుగ ఐక్యంగా జరుపుకుంటారు. కొత్తగా నిర్మించుకున్న రామాలయం, హనుమాన్ ఆలయాల్లో ప్రత్యేక సందర్భాల్లో భజనకీర్తనలు చేస్తారు. ఎమ్మెల్యే నిధులతో పీర్లబంగ్లా బాగు చేసుకున్నారు. జిల్లాలోనే ఇక్కడ మొహర్రం పెద్ద ఎత్తున నిర్వహిస్తుంటారు. ఆధ్యాత్మికతతో అందరూ రాజకీయాలకతీతంగా కలిసి మెలిసి ప్రగతికి సహకరిస్తున్నారు. సర్పంచ్ జీ స్వాతిక, ఉపసర్పంచ్ లక్ష్మీబాయి, వీడీసీ ప్రతినిధులు ప్రతి పథకాన్ని అర్హులకు చేర్చేందుకు కృషి చేస్తున్నారు.
మెరుగైన విద్య ,వైద్యం గ్రామంలోని ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో సమీప 10 గ్రామాల విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇక ఆరోగ్య ఉపకేంద్రంలో అన్ని సౌకర్యాలు ఉన్నాయి. దీనితో సమీప రాజులవాడి, కరణ్‌వాడి, టేకిడిరాంపూర్, కొజ్జన్గూడ గిరిజనులకు కూడా సౌలభ్యంగా ఉన్నది. గ్రామ పరిపాలన వాట్సాప్ గ్రూపుద్వారా పచ్చదనం, పరిశుభ్రత పెంపు, యువత ఉద్యోగ కల్పనకు గ్రామానికి చెందిన ఉద్యోగులు, ఇతర దేశాల్లో ఉన్న సైంటిస్టులు సహకరిస్తున్నారు.
ఐక్యతతో అభివృద్ధి..
కరంజి(టీ)లో అభివృద్ధి పనులకు అందరి సహకారం ఉన్నది. ప్రతి పండుగ కలిసి మెలిసి జరుపుకుంటాం. మా జీపీ నుంచి దాదాపుగా పోలీసు కేసులు ఉండవు . ఉద్యోగులంతా పుట్టిన ఊరి ప్రగతికి సహకరిస్తున్నారు. యువరైతులు ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం చేస్తున్నారు. ప్రభుత్వ రైతుబంధు పథకంతో 100 శాతం రైతులు మధ్యదళారి వ్యవస్థకు దూరమయ్యారు.
బక్కి సతీష్‌యాదవ్, యువ రైతు , కరంజి(టీ)
అన్ని వర్గాలకు పథకాలు
మా పంచాయతీల ప్రతి కులవృత్తి దారులకు అవసరమైన పథకాలు అందించారు. దళితబస్తీ భూముల్లో మంచిగా పంటల సాగు చేసుకుంటు న్నారు. గ్రామంలోని సర్కారు బడిలోనే చదువుకున్న మా కుమారుడు ఇపుడు వరంగల్ కాకతీయ యూనివర్శిటీలో చదువుతున్నాడు. సీఎం కేసీఆర్ సారు అన్ని వర్గాలకు మంచి పథకాలు అందిస్తున్నారు.
– నల్ల హన్మాండ్లు ,రైతు,కరంజి(టీ),
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI | భారత్‌తో మూడో టీ20.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్టిండీస్
Pakistan | పాకిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.. పీటీఐ ప్రభుత్వం రద్దు.. సీఎం అరెస్ట్
Agriculture Admissions | వ్యవసాయ కోర్సుల్లో మిగిలిన సీట్లకు కౌన్సెలింగ్.. ఈ నెల 14 నుంచి ప్రారంభం
Kadapa DSP | కడప డీఎస్పీగా భవానీ భాధ్యతల స్వీకరణ
MLC Dasoju Shravan Kumar | ఈ ప్రభుత్వానికి ఎంప్లాయింట్ పాలసీనే లేదు : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

