దండేపల్లి, ఫిబ్రవరి 3: దండేపల్లి మండలంలోని గూడెం శ్రీసత్యనారాయణస్వామి ఆలయంలో ఈనెల 18 నుంచి సత్యదేవుడి కల్యాణ బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. 21న జరుగనున్న స్వామి వారి కల్యాణానికి హాజరు కావాల్సిందిగా మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు,
జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్‌ను ఆలయ ఈవో సంకటాల శ్రీనివాస్, కమిటీ సభ్యులు ఆహ్వా న పత్రికలు అందజేశారు.అనంతరం శేషవస్ర్తాలతో సన్మానించారు. ప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో అర్చకులు సంపత్‌స్వామి, నారాయణశర్మ, నాయకులు గడ్డం త్రిమూర్తి, సిబ్బంది ఉన్నారు.