ఆదిలాబాద్, ఫిబ్రవరి 3(నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్ మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలో టికెట్ల పంపిణీ తీవ్ర గందరగోళానికి దారితీసింది. ఈ ఎన్నికల్లో పార్టీ టికెట్లు ఆశించినా చేరిన వారికి బీ-ఫారాలు అందకపోవడంతో నాయకులు రాజీనామా చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు విద్యానగర్ కాలనీ మాజీ కౌన్సిలర్ కలాల శ్రీనివాస్ పార్జీకి రాజీనామా చేస్తున్నట్లు వీడియో విడుదల చేశారు.
ఎంపీ ఎన్నికల సమయంలో తను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరానని, ఆదిలాబాద్ కాంగ్రెస్ నియోజకవర్గం ఇన్చార్జి కంది శ్రీనివాస్ రెడ్డి తనకు కౌన్సిలర్ టికెట్ ఇవ్వడమే కాకుండా ఉన్నత స్థానాలకు తీసుకుపోతానని హామీ ఇచ్చారన్నారు. తీరా తనకు టికెట్ ఇవ్వడం లేదని ఫోన్లో తెలిపారని, దీంతో మనస్తాపం చెంది కాంగ్రెస్కు రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. తాను ఇండిపెండెంట్గా బరిలో ఉంటానన్నారు.