తుంగతుర్తి, జూలై 17 : ఈ నెల 19న సూర్యాపేట జిల్లా తుంగతుర్తి సంత వేలం పాట ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్వహించనున్నట్లు తుంగతుర్తి గ్రామ సర్పంచ్ మల్లెపాక సాయిబాబా తెలిపారు. శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. మండల కేంద్రంలో ప్రతి సోమవారం నిర్వహించే సంతకు పాల్గొనేవారు లక్ష రూపాయలు డిపాజిట్ చెల్లించి వేలం పాటలో పాల్గొనాలని కోరారు. ఆసక్తి గల వారు రూ.500 దరఖాస్తు ఫారం చెల్లించి పాల్గొనాలని సూచించారు. వేలంలో పాల్గొనే వారు గ్రామ పంచాయతీకి ఎలాంటి బకాయిలు ఉండరాదని, వేలంలో వేలం పాట పొందినవారు పాడిన పాటలో సగం అమౌంట్ చెల్లించాలన్నారు. వేలం పాటకు ముఖ్య అతిథిగా మండల ఎంపీడీఓ హాజరు కానున్నట్లు తెలిపారు.