యువ సంగ్రామ సభను విజయవంతం చేయాలి : మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్
కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలతో పాటు యువతను అన్ని విధాలా మోసం చేసిందని మాజీ రాజ్యసభ సభ్యుడు, బీఆర్ఎస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగులు, యువత ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ...
సూర్యాపేట, జూలై 17 : కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలతో పాటు యువతను అన్ని విధాలా మోసం చేసిందని మాజీ రాజ్యసభ సభ్యుడు, బీఆర్ఎస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగులు, యువత ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ శనివారం హైదరాబాద్ సరూర్ నగర్ స్టేడియంలో ఉదయం 11 గంటలకు జరిగే యువ సంగ్రామ సభను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. యువత ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిర్వహించే యువ సంగ్రామ సభను ప్రభుత్వం అడ్డుకోవాలని చూస్తే కోర్టు అనుమతి ఇచ్చిందన్నారు.
ఆచరణకు సాధ్యం కానీ హామీలతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నిలువునా ముంచిందన్నారు. యువతపై ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఖాళీ పోస్టులను భర్తీ చేయాలన్నారు. యువత ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రేపు హైదరాబాడ్ సరూర్‌నగర్ స్టేడియంలో జరిగే యువ సంగ్రామ సభకు నిరుద్యోగులు, యువత అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

