FIFA World Cup : ఫిఫా వరల్డ్‌కప్ ఫైనల్‌కు రెండు రోజులే ఉంది. సెమీస్‌లో అదరగొట్టిన స్పెయిన్, అర్జెంటీనా టైటిల్ పోరుకు కాచుకొని ఉండగా విజేతలకు ప్రత్యేకమైన బహుమతులు ఇవ్వాలని ఫిఫా ఆలోచిస్తోంది. ప్రపంచకప్ చరిత్రలో తొలిసారిగా ‘ఛాంపియన్షిప్ రింగ్స్'(Championship Rings) ఇవ్వాలనుకుంటోంది. అమెరికాలో ప్రతిష్ఠాత్మక బాస్కెట్ బాల్ ఈవెంట్.. ఎన్బీఏ(NBA)లో నెగ్గిన జట్టు ఆటగాళ్లకు ఛాంపియన్షిప్ రింగ్స్ ప్రదానం చేస్తారు. ఫిఫా కూడా ఈ ఒరవడికి శ్రీకారం చుట్టాలనుకుంటోంది. అదే జరిగితే.. పుట్‌బాల్ ఆటలో ఈ ఉంగరాలు అందుకున్న రికార్డు విజేతలకు సొంతమవ్వనుంది.
అమెరికా, మెక్సికో, కెనడాలు సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఫిఫా వరల్డ్‌కప్ 2026 విజేతలకు జీవితాంతం గుర్తిండిపోయే కానుక లభించనుంది. న్యూయార్స్‌లోని న్యూ జెర్సీ స్టేడియంలో జూలై 19, ఆదివారం జరుగునున్న ఫైనల్లో గెలుపొందిన జట్టుకు ట్రోఫీ బహూకరణ, ఆటగాళ్లకు గోల్డ్ మెడల్స్‌తో పాటు.. ఈసారి ఛాంపియన్షిప్ ఉంగరాలు కూడా ఇవ్వనుంది ఫిఫా.
Fifa will present World Cup rings to the winners of Sunday’s final between Argentina and Spain, which will be attended by Donald Trump. pic.twitter.com/17wyQMDfG8
— BBC Sport (@BBCSport) July 17, 2026
ఎడిషన్ 2026 కాబట్టి.. మొత్తం 2026 ఉంగరాలు సిద్ధం చేస్తున్నారు. వీటిలో 30 రింగ్స్ విజేతగా నిలిచిన జట్టుకు కాగా.. మిగిలిన 1,996 ఉంగరాలను గుర్తింపు పొందిన సంస్థల ద్వారా అభిమానులకు అమ్మనున్నారు. ఛాంపియన్షిప్స్ ఉంగరం ప్రత్యేకంగా ఉండనుంది. దీనికి ఒకవైపు ఫిఫా వరల్డ్‌కప్ ట్రోఫీ ఉంటుంది. రెండోవైపు.. గెలుపొందిన జట్టుకు సంబంధించిన దేశం చిహ్నం ముద్రించి ఉంటుంది.
🚨🚨| BREAKING: The 2026 World Cup Champions will receive championship 𝐑𝐈𝐍𝐆𝐒 for the very first time in history.
Inspired by North American sports tradition, 30 rings will be handed out to the winners.
There will also be limited-edition rings available for fans worldwide. pic.twitter.com/wbHZAlCp32
— CentreGoals. (@centregoals) July 17, 2026
అలానే ప్రతి ఉంగరానికి వ్యక్తిగత నంబర్ ఉంటుంది. అయితే.. ఫైనల్ అనంతరం విన్నింగ్ టీమ్ కెప్టెన్, కోచ్‌కు తాత్కాలిక ఛాంపియన్షిప్ రింగ్స్ ప్రదానం చేస్తారు. సంబురాలు ముగిశాక.. ఆటగాళ్లు, సిబ్బంది వేళ్లకు సరిపోయేలా కస్టమైజ్ చేసిన ఉంగరాలను అధికారికంగా ఫిఫా అందజేయనుంది.