ఎదులాపురం, డిసెంబర్ 27 : జీవో నంబర్ 252ను తక్షణమే సవరించాలని జర్నలిస్టులు డిమాండ్ చేశారు. తెలంగాణ జర్నలిస్టు ఫోరం, టీ యూడబ్ల్యూజే(హెచ్ 143) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట జర్నలిస్టులతో కలిసి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా జర్నలిస్టు సంఘం జిల్లా అధ్యక్షుడు రమేశ్ మాట్లాడుతూ.. కొత్త జీవో వల్ల అనేక మంది జర్నలిస్టులు, డెస్ జర్నలిస్టులు అక్రిడిటేషన్లు కోల్పోవాల్సి వస్తున్నదన్నారు. అనంతరం జర్నలిస్టు సమస్యలపై కలెక్టర్ రాజ ర్షి షాకు వినతిపత్రం అందజేశారు.
అలాగే అక్రిడిటేషన్ కార్డులతోపాటు జర్నలిస్టుల సమస్యలపై కలెక్టర్ రాజార్షి షాకు యూనియన్ తరపున విన తి పత్రం అందజేశారు. కార్యక్రమంలో యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్.రాజు, ఉపాధ్యక్షులు ఎంఏ అన్వర్, యూనియన్ నాయకులు పిట్ల రాము, సంతోష్, సుభాష్, వీరేష్, రమేశ్, ప్రశాంత్, సతీష్, నామ్దేవ్, రత్నాకర్, శ్రీనివాస్, దశరథ్, మహబూబ్ ఖాన్, రాజేశ్వర చారి, దేవ రెడ్డి, భూమేశ్, తేజ, సత్యనారాయణ పాల్గొన్నారు.
డెస్ జర్నలిస్టు ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలోనూ జీవో 252ను సవరించాలని కోరుతూ ఆదిలాబాద్ కలెక్టరేట్ ఏవో ఎస్తర్ వర్ణకు వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో డెస్ జర్నలిస్టుల ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ గౌరవ అధ్యక్షుడు రాపర్తి దత్తాత్రి, టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మెడపట్ల సురేష్, షేక్ మొయిజ్, ప్రింట్ మీడియా ప్రెస్ క్లబ్ కన్వీనర్ ఎం.సుధాకర్, డెస్ జర్నలిస్టుల ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ కన్వీనర్ ఇందూర్ సాయిరాం, కో కన్వీనర్లు నిలేష్, రాజన్న, సభ్యులు రాజు, ఆరీఫ్, సుజాత, స్వామి, వంశీ పాల్గొన్నారు.
నిర్మల్ అర్బన్, డిసెంబర్ 27 : 252 జీవో వల్ల అక్రిడిటేషన్లు కలిగిన 10 వేల మంది రాష్ట్రవ్యాప్తంగా అక్రిడిటేషన్లు కోల్పోయే ప్రమాదం ఉందని, జీవోను సవరించాలని టీయూడబ్ల్యూజే 143 యూనియన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు మాదాపురం మహేశ్, లక్ష్మీనారాయణ, రాం మహేశ్, అల్లం అశోక్, రాంపెల్లి నరేందర్ పాల్గొన్నారు.