ఎదులాపురం, మార్చి 3 : ఈ నెల 12న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌ను సద్వి నియోగం చేసుకోవాలని ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయమూర్తి, డీఎల్ఎస్ఏ చైర్పర్సన్ ఎంఆర్ సునీత సూచించారు. జిల్లా కోర్టు ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో గురు వారం ఆమె మాట్లాడారు. కోర్టు చుట్టు కక్షిదారులు తిరుగు తూ సమయాన్ని వృథా చేసుకో వద్దనే ఉద్దేశంతో లోక్ అదాలత్‌ను నిర్వహిస్తున్నామని పేర్కొ న్నా రు. వివిధ కేసులు త్వరగా పరిష్కరించు కునేం దుకు లోక్ ఆదాలత్ మంచి వేదిక అని తెలి పారు. అన్ని సివిల్, బ్యాంక్, ఫ్యామిలీ కేసులు తదితర వాటిని పరిష్కరిస్తామని పేర్కొన్నారు. కార్యక్ర మంలో న్యాయమూర్తులు డీ శ్రీనివాస్‌రా వు, జీ ఉదయ్ భాస్కరావు, జే మైత్రేయి, ప్రాసిక్యూషన్ డిప్యూటీ డైరెక్టర్ కిరణ్‌కుమార్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.