ఎదులాపురం, ఏప్రిల్ 19 : భూ భారతి పేరిట పర్యటిస్తున్న మంత్రులు పొంగులేటి శ్రీనివాస్, సీతకలు రైతులకు చేసింది ఏమీ లేదని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. శనివారం ఆదిలాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి జోగు రామన్న కార్యకర్తలతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి దిశానిర్దేశం చేశారు. మొదట పార్టీ కార్యాలయంలో రజతోత్సవ సభ పోస్టర్లను ఆవిషరించారు. అనంతరం జోగు రామన్న మాట్లాడుతూ.. ఈనెల 27న కేసీఆర్ చేపట్టే సభ చరిత్రలో నిలిచిపోతుందన్నారు.
కాంగ్రెస్ బెదిరింపులు, అరెస్టులకు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఎప్పుడు కూడా వెనకడుగు వేయద్దన్నారు. అలాగే కేసీఆర్ సభా వేదిక ద్వారా కార్యకర్తల్లో నూతనోత్సాహాన్ని నింపనున్నారు. ఈ కార్యక్రమంలో. మాజీ మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, అలాల్ అజయ్, నారాయణ, ప్రహ్లాద్, అష్రాఫ్, యూనిస్ అక్బాని, సాజిదుద్దీన్, సలీం పాషా, కస్తాల ప్రేమల, స్వరూప, బొడగం మమత పాల్గొన్నారు.