బోథ్, ఫిబ్రవరి 27 : రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనతో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను ప్రభుత్వం కల్పిస్తున్నదని టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. మండలంలోని మర్లపెల్లి, బోథ్ గ్రా మాల్లో తుల శ్రీనివాస్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యం లో ఏర్పాటు చేసిన తాలూకా స్థాయి క్రికెట్ పో టీల్లో గెలుపొందిన జట్లకు ఆదివారం బహుమతు లు ప్రదానం చేశారు. యువత మాదక ద్రవ్యాలు, గంజాయి, గుట్కాకు దూరంగా ఉండాలన్నారు. ప్రభుత్వం నూతన పారిశ్రామిక విధానం ద్వారా రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చొరవతో ఇప్పటికే 18 లక్షల ఉద్యోగావకాశాలు కల్పించిందన్నారు. త్వరలోనే సుమారు 80 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మొదలవుతుందని తెలిపారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలన్న కేంద్రంలోని బీజేపీ ప్ర భుత్వానికి ఉద్యోగాల భర్తీ విషయమై రాష్ర్టాన్ని విమర్శించే అర్హత లేదన్నా రు. ఎమ్మెల్యే బాపురావ్ మాట్లాడు తూ.. అన్ని వర్గాల సంక్షేమం కోసం ప్రభుత్వం పథకాలను అమలు చేస్తున్నదన్నారు. మాజీ ఎంపీ నగేశ్ మా ట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారుల నైపుణ్యాన్ని వెలికితీయడానికి, ప్రోత్సాహకానికి త్వరలోనే నూతన క్రీడా విధానం అమలు చేయనున్నదని పేర్కొన్నారు.డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, బోథ్ ఎంపీపీ తుల శ్రీనివాస్, నేరడిగొండ జడ్పీటీసీ జాదవ్ అనిల్, వైస్ ఎంపీపీ రాథోడ్ లింబాజీ, సొసైటీ చైర్మన్ కే ప్రశాంత్, బోథ్, గుడిహత్నూర్ మండలాల సర్పంచుల సంఘం అధ్యక్షులు బీ శ్రీధర్‌రెడ్డి, తిరుమల్‌గౌడ్, సర్పంచ్ దే వేందర్, ఉప సర్పంచ్ కమలాకర్, ఎంపీటీసీలు, సర్పంచులు, వివిధ గ్రామాల పార్టీ నాయకులు, కార్యకర్తలు, క్రీడాకారులు పాల్గొన్నారు. అంతకుముందు టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికై బోథ్ మండలానికి తొలిసారిగా వచ్చిన జోగు రా మన్నకు ఘన స్వాగతం పలికారు. పటాకులు కాల్చారు. పొచ్చెర క్రాస్‌రోడ్డు నుంచి 15 కిలోమీటర్ల మేర వాహనాలతో భారీ కాన్వాయ్ ర్యాలీ ఏర్పాటు చేశారు.