నిర్మల్ చైన్గేట్, మే 7 : నిర్మల్ జిల్లా సోన్ మండలంలోని జాఫ్రాపూర్ గ్రామంలో మొక్కజొన్న, ధాన్యం తరలింపులో జాప్యంపై రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ రాజారెడ్డి మాట్లాడుతూ.. ధాన్యం తూకం పూర్తయినా లారీలు రాకపోవడంతో పక్షం రోజులుగా ధాన్యం ఉండిపోయిందన్నారు. గన్నీ సంచులు, లారీల కొరత వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు.
వర్షాలు కురిస్తే పంట నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. అధికారులు వెంటనే స్పందించి ధాన్యం తరలించాలని కోరుతూ గురువారం నిర్మల్ రెవెన్యూ అదనపు కలెక్టర్ కిశోర్కుమార్కు వినతిపత్రం సమర్పించారు.