నార్నూర్, డిసెంబర్ 23 : విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించి వార్షిక పరీక్షలకు సన్నద్ధం చేయాలని జిల్లా మాధ్యమిక విద్యాధికారి జాదవ్ గణేష్ కుమార్ అధ్యాపకులకు సూచించారు. సోమవారం ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించి పలు వివరాలు తెలుసుకున్నారు.
అనంతరం విద్యార్థులతో మాట్లాడుతూ.. విద్యార్థులు ఇష్టపడి చదువుకొని వార్షిక పరీక్షలకు సన్నద్ధం కావాలని, ఇంటర్మీడియట్ లో 100% ఉత్తీర్ణత సాధించాలని సూచించారు. అలాగే విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించి పరీక్షలకు సన్నతం చేయాలని అధ్యాపకులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరీక్ష నిర్వహణ అధికారి శ్రీనివాస్, ధనరాజ్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి బాలాజీ కాంబ్లే, అధ్యాపకులు ఉన్నారు.