మంచిర్యాలటౌన్, సెప్టెంబర్ 10 : మంచిర్యాలలో కాంగ్రెస్ గూండాలు బరితెగించి వ్యవహరిస్తున్నారని, వారికి ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు వంతపాడుతున్నారని, పోలీసులు తీరు దారుణంగా ఉందని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు మండిపడ్డారు. బుధవారం మంచిర్యాలలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మంగళవారం రాత్రి కాంగ్రెస్ గూండాల దాడిలో గాయపడి.. స్థానిక ప్ర భుత్వ దవాఖానలో చికిత్స పొందుతున్న కాటంరాజును బుధవారం నాయకులతో కలిసి ర్యాలీగా వెళ్లి పరామర్శించారు.
ఈ సందర్భంగా దివాకర్‌రావు మాట్లాడుతూ ఈ ప్రాంత ప్రజాప్రతినిధుల సహకారంతో మంచిర్యాల పట్టణంలో మంచి వాతావరణం ఉండేదని, కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నాయకులు, ప్రజలపై దాడులు జరుగుతున్నాయన్నారు. పీఎస్సార్ ఎమ్మెల్యేగా గెలిస్తే రౌడీయిజం పెరుగుతుందని ఆనాడే చెప్పానని, స్వయాన పీఎస్సారే ఉరికించి కొడతానని చెప్పిన సందర్భాలున్నా యన్నారు. ఇందిరమ్మ రాజ్యం అం టే ఇదేనా అని ప్రశ్నించారు.
గతంలో ఎన్నడూ ఇ లాంటి ఘటనలు జరగలేదన్నారు. ఎన్నికల ఫలితాల రోజునే హమాలీవాడ, పాత మంచిర్యాలలో దాడులు జరిగినట్లు తెలిపారు. ఆనాడే పోలీసులు సరైన రీతిలో స్పందించి ఉంటే ఈనాడు ఈ పరిస్థితి ఉండేది కాదన్నారు. దా డులు చేసిన వారికి అండగా ఉంటానని పీఎస్సార్ చె ప్పడం వల్లే వారు రెచ్చిపోతున్నారని ఆరోపించారు. తాజాగా.. మంగళవారం రాత్రి ఫ్లెక్సీల విషయంలో చోటుచేసుకున్న చిన్న ఘటనలో ఘర్షణ చోటు చేసుకున్నదని, ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా ఒకరిని ఏకం గా పోలీస్‌స్టేషన్‌లోనే కాంగ్రెస్ గూండాలు కొట్టారని చెప్పారు.
ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన ఐదారుగురు బీ ఆర్ఎస్ నాయకులపై దాదాపు 50 మంది కాంగ్రెస్ గూండాలు దాడికి ప్పాల్పడ్డారని, పోలీస్‌స్టేషన్ లోప లా, బయటా సీసీ కెమెరాలు ఉంటాయని, వాటిలో రికార్టు అయిన ఫుటేజీని బహిర్గతం చేయాలని పేర్కొన్నారు. దాడికి గురైన వారిలో బేర సత్యనారాయణ, కాటంరాజు, ప్రశాంత్, వంశీ ఉన్నారని, కాటం రాజు అనే దళిత వ్యక్తిపై బండలతో విపరీతంగా కొట్టారని, అతని పరిస్థితి విషమంగా ఉందని, ఏదైనా జరిగితే వారిని నమ్ముకున్న వారి పరిస్థితి ఏమిటని ప్రశ్నించా రు.
ఈ విషయంలో ప్రజలంతా ఆలోచించాలని పే ర్కొన్నారు. దాడులు చేసిన కాంగ్రె స్ రౌడీలను వెంట నే అరెస్ట్ చేయాలని, కాటంరాజు అనే దళిత వ్యక్తిపై దాడిచేసిన వారిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అలాంటప్పుడే పోలీసులపై ప్రజల్లో నమ్మకం ఉంటుందని, ఆ దిశగా సీపీ చర్యలు తీసుకోవాలని కోరారు. గతంలో కూడా బీఆర్ఎస్ నాయకులపై దాడులు చేశారని, న్యాయం కోసం పోలీసులను ఆశ్రయిస్తే దాడి చేసినవారిపై కాకుండా దాడికి గురై గాయాల పాలైన వారిపైనే కేసులు పెట్టారని పేర్కొన్నారు.
మంచిర్యాలలో పోలీసులు ఏకపక్షంగా, ఎమ్మెల్యేకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. నస్పూరులో తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర ఎన్నో ఏళ్ల నుంచి బీఆర్ఎస్ జెండా ఉన్నదని, దానికి కాంగ్రెస్ జెండాలు కట్టారని, పైగా ఇక్కడ తమ జెండానే ఉందని అబద్ధాలు ఆడుతున్నారన్నారు. మంచిర్యాల, లక్షెట్టిపేట మాజీ మున్సిపల్ చైర్మన్లు పెంట రాజయ్య, నల్మాసు కాంతయ్య, బీఆర్ఎస్ నాయకులు అత్తి సరోజ, గోగుల రవీందర్‌రెడ్డి, పల్లె భూమేశ్, పట్టణ అధ్యక్షుడు గాదెసత్యం, అంకం నరేశ్, అక్కూరి సుబ్బయ్య, వంగ తిరుపతి, శ్రీరాముల మల్లేశ్, రవీందర్, రవీందర్ పాల్గొన్నారు.