అంతర్రాష్ట్ర నకిలీ వీసా ముఠా అరెస్టు
అమాయకులు, నిరుద్యోగులను ఆసరా చేసుకుని విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని నకిలీ వీసాలు సృష్టించి మోసం చేసిన ఇద్దరిని అరెస్టు చేసినట్లు నిర్మల్ డీఎస్పీ గంగారెడ్డి తెలిపారు.
నిర్మల్ అర్బన్, ఏప్రిల్ 4 : అమాయకులు, నిరుద్యోగులను ఆసరా చేసుకుని విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని నకిలీ వీసాలు సృష్టించి మోసం చేసిన ఇద్దరిని అరెస్టు చేసినట్లు నిర్మల్ డీఎస్పీ గంగారెడ్డి తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సీసాన రాజేశ్‌కుమార్, రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన పెగ్గర్ల చంద్రశేఖర్‌లు ఇద్దరు స్నేహితులు. వీరిద్దరు కూడా కరీంనగర్‌లోని రేకుర్తిలో గదిని అద్దెకు తీసుకుని ఉంటున్నారు. వీరి గది పక్కనే నిర్మల్ జిల్లా సోన్, నిర్మల్, సారంగాపూర్ యువకులు కూడా కిరాయికి ఉంటున్నారు. ఈ ముగ్గురు యువకులు ఉద్యోగ వేటలో ఉండ గా.. రాజేశ్‌కుమార్, చంద్రశేఖర్ చాయ్ హో టల్లో పరిచయం అయ్యారు.
మేము ఆర్మీ ఆఫీసర్స్మని నకిలీ స్టాంప్స్ తయారు చేసుకుని ఈ యువకులను విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మ బలికారు. ఈ ము గ్గురు యువకులు ఇంటికి వచ్చినా తరచూ ఫోన్ చేస్తూ ఉండేవారు. వీసా కోసమని రూ.2.65 లక్షలు ఫోన్ పే చేయించుకున్నారు. కడ్తాల్ యువకుని నుంచి రూ.1.25 లక్షలు, నిర్మల్ యువకుని నుంచి రూ.70 వేలు, అలూర్ యువకుని నుంచి రూ.70 వేలు తీసుకుని ఫేక్ వీసాలు పంపించారు. బాధితులు మోసపోయామని గ్రహించి పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు గురువారం సోన్‌లో రాజేశ్‌కుమార్, చంద్రశేఖర్‌లను అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి 11 సిమ్ కార్డులు, ఆర్మీ డ్రెస్, బ్యాంకు పాస్ బుక్‌లు, చెక్ బుక్‌లు, రూ.2,500 నగదు, మొబైల్ ఫోన్, ప్రామిసరీ నోట్, ఫోర్జరీ వీసా జిరాక్స్ కాపీలను స్వాధీనం చేసుకున్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

